Konda Vishweswar Reddy : నాతో పాటు ఆ నలుగురు.. కాంగ్రెస్‌లో చేరికపై కొండా క్లారిటీ?
Konda Vishweswar Reddy : ప్రస్తుతం తెలంగాణలో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే.. కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. బీజేపీ పార్టీ అయితే తుస్సుమన్నది. ఎన్నికల సమయంలో అసలు బీజేపీని పట్టించుకునే నాథుడే లేడు. అసలు ఆ పార్టీని బలోపేతం చేసేందుకు సరైన నాయకుడే లేడు. ఇక.. అధికార బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏం జరిగేది చెప్పలేం. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో చాలా క్రేజ్ వచ్చేసింది. ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు, ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పొంగులేటి, తుమ్మల, మైనంపల్లి లాంటి కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. చివరకు బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లోనే చేరుతున్నారు.
బీజేపీలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి. బీజేపీ అసలు టార్గెట్.. కేసీఆర్. బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలోకి అప్పట్లో చాలామంది చేరారు. అప్పుడు అందరూ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనుకున్నారు కానీ.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగానే.. తెలంగాణలో కాంగ్రెస్ ఉవ్వెత్తున లేచింది. అలాగే.. తెలంగాణ రాజకీయాలు కూడా పూర్తిగా యూ టర్న్ తీసుకున్నాయి. ఇంతలో బీజేపీలో పలు కీలక మార్పులు చోటు చేసుకోవడంతో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈనేపథ్యంలో బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అది ఖాయం అయితే కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన రెడీగా ఉన్నారు.
Konda Vishweswar Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనా?
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నట్టుగా అనుమానం వస్తోంది. అందుకే పలువురు బీజేపీ నేతలు కూడా బీజేపీని వీడుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తనతో పాటు మరో నలుగురు నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ తో అంతర్గత చర్చల గురించి చర్చించి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.