KTR : లోక్‌స‌భ‌కు కేటీఆర్ పోటీ చేస్తారా..? లోకల్ పరిస్థితి ఏంటి మరి ..?! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

KTR : లోక్‌స‌భ‌కు కేటీఆర్ పోటీ చేస్తారా..? లోకల్ పరిస్థితి ఏంటి మరి ..?!

KTR : నిజానికి కేటీఆర్ ఢిల్లీ వైపు చూస్తే లోకల్ గా పార్టీ వ్యవహారాల పరిస్థితి ఏంటి అసలు..ఈ విషయంలో అధిష్టానం ఆలోచన ఎలా ఉందని, అసెంబ్లీ ఎన్నికల తో షాక్ అయిన బీఆర్ఎస్ లోక సభ ఎన్నికల్లో ఎక్కువ‌ కేర్ తీసుకుంటున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దెబ్బ ఎక్కడ పడిందో క్లారిటీ వస్తున్నందున ఈసారి అప్పుడే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష మొదలుపెట్టింది బీఆర్ఎస్ నాయకత్వం. పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్న ఈ సమావేశంలో ఒకరకంగా […]

 Authored By anusha | The Telugu News | Updated on :8 January 2024,11:00 am

KTR : నిజానికి కేటీఆర్ ఢిల్లీ వైపు చూస్తే లోకల్ గా పార్టీ వ్యవహారాల పరిస్థితి ఏంటి అసలు..ఈ విషయంలో అధిష్టానం ఆలోచన ఎలా ఉందని, అసెంబ్లీ ఎన్నికల తో షాక్ అయిన బీఆర్ఎస్ లోక సభ ఎన్నికల్లో ఎక్కువ‌ కేర్ తీసుకుంటున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దెబ్బ ఎక్కడ పడిందో క్లారిటీ వస్తున్నందున ఈసారి అప్పుడే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష మొదలుపెట్టింది బీఆర్ఎస్ నాయకత్వం. పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్న ఈ సమావేశంలో ఒకరకంగా అభ్యర్థుల పేర్లు ఖరారు అవుతున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలుు హోరాహోరీగా జరుగుతాయన్నా అంచనాల నడుమ ఈసారి అభ్యర్థుల ఎంపికలు ఆచీ తూచి అడుగులు వేయాలనుకుంటుంది గులాబీ నాయకత్వం. అందుకే సీనియర్స్ ను బరిలోకి దింపి తే ఎలా ఉంటుంది అనే చర్చ అంతర్గతంగా జరుగుతున్నాయని అంటోంది పార్టీ వర్గాలు.

ఈ క్రమంలోనే మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు గులాబి శ్రేణుల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ శ్రేణుల్లో నిర్ణయానుసారం కేటీఆర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక ఎత్తు అయితే గెలిచి ఢిల్లీకి వెళ్తే ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఏంటనేది చర్చ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుందట. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ రాష్ట్ర వ్యవహారాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పైగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ఎప్పటికప్పుడు ప్రతి వ్యూహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అలాంటప్పుడు ఆయన లోక్సభ పేరుతో ఢిల్లీకి వెళితే ఇక్కడ వ్యవహారాల బాధ్యత ఎవరికి అప్పచెప్పుతారు అనే ప్రశ్నలు సమాధానాన్ని వెతుకుతున్నాయట బీఆర్ఎస్ వర్గాలు.

ఆ క్రమంలోనే హరీష్ రావు, కవిత పేర్లను ప్రస్తావిస్తున్నాయట పార్టీ వర్గాలు. ప్రస్తుతం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ను ఎన్నుకున్నారు. కానీ గత సెషన్ లో కేటీఆర్, హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లో నిజంగానే కేటీఆర్ లోక్‌స‌భ‌కు వెళితే రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను హరీష్, కవితలకు అప్పగిస్తారని చర్చ పార్టీ వర్గాల్లో గట్టిగానే జరుగుతుందట. అదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్ సభకు పోటీ చేసే అవకాశం లేదని మరో వాదన కూడా ఉంది. జరుగుతున్నదంతా ప్రచారం మాత్రమే అని పరిస్థితి అంతదాకా వచ్చినప్పుడు ఆలోచించవచ్చని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బిఆర్ఎస్ లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయాలు ఎటునుంచి ఎటు వైపుకు టర్న్ తీసుకుంటాయో చెప్పడం కష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది