Ganji chiranjeevi : మంగళగిరిలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన గంజి చిరంజీవి
Ganji chiranjeevi : రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఏయే నియోజకవర్గాల్లో వైసీపీ వీక్ గా ఉందని భావిస్తున్నారో అక్కడ ప్రత్యామ్నాయాన్ని తయారుచేస్తున్నారు.అందులో భాగంగానే గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు తిరుగులేకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను వైసీపీలో చేర్చుకోవాలని జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు..
Ganji chiranjeevi : ఆళ్ల స్థానంలో గంజి చిరంజీవి..
2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ లేనంత దారుణ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన నాయకత్వం అందులో లేదని కొందరు టీడీపీ సీనియర్ లీడర్లు భావిస్తున్నారట.చంద్రబాబుకు వయోభారంతో బాధపడుతున్నారు. నారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి తెస్తారనే నమ్మకం తెలుగు తమ్ముళ్లకు అసలే లేదంట.. ఈ క్రమంలోనే చాలా మంది పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారట.. తాజాగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి సతీసమేతంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన మంగళగిరి టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. సీఎం జగన్ కూడా చిరంజీవికి అభయం ఇచ్చారని తెలుస్తోంది.అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పరిస్థితి ఎంటని ఇప్పుడు చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవి అక్కడ పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏకంగా నారా లోకేశ్ ను ఓడించారు. సిట్టింగ్ స్థానంలో చిరంజీవికి టికెట్ ఇస్తే మరి ఆళ్ల పరిస్థితి ఎంటని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.