Married Woman : ఘోరం.. దైవ దర్శనానికి వచ్చిన మహిళ.. నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడి..!
ప్రధానాంశాలు:
Married Woman : ఘోరం.. దైవ దర్శనానికి వచ్చిన మహిళ.. నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడి..!
Married Woman : ఆడబిడ్డలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు తగ్గడం లేదు. తాజాగా నాగర్‌కర్నూల్ ఘటన అందరు ఉలిక్కిపడేలా చేసింది. దైవదర్శనానికి వచ్చిన మహిళను కూడా వదలలేదు కామాంధులు. కుటుంబంతో కలిసి దేవుడిని దర్శించుకునేందుకు వచ్చింది ఓ మహిళ. మొక్కులు తీర్చుకున్న తర్వాత ఆమె అనుకోని విధంగా కామాంధులకు బలైపోయింది.

Married Woman : ఘోరం.. దైవ దర్శనానికి వచ్చిన మహిళ.. నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడి..!
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దేవలయం దైవదర్శనానికి వచ్చిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంధువును వెంట పెట్టుకుని మహిళ బహిర్భూమికి వెళ్లింది. ఆ కుటుంబం వచ్చినప్పటి నుంచి ఆ ఊరలోని కొందరు వ్యక్తులు మహిళపై కన్నేశారు. అవకాశం కోసం ఎదురు చూశారు.
మహిళ బహిర్భూమికి వెళ్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు… ఆమె వెంటే వెళ్లారు. ఆపై మహిళతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేసి.. మహిళను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. ఆమెపై ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం సేవిస్తూ ఉదయం 4 గంటల వరకూ ఒకరి తరువాత మరొకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారట. దాహం వేస్తుందని అడిగిన ఆ మహిళ నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడికి పాల్పడి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, పుస్తెలు, కమ్మలు దోచుకొని వెళ్లారు