Married Woman : ఏంట్రా ఇది.. భర్త ఉన్నా.. బాయ్ ఫ్రెండ్ మాట్లాడడం లేదని వివాహిత ఏం చేసిందంటే..?
ప్రధానాంశాలు:
వివాహేతర సంబంధం కారణంగా మరొకరిబలి
భర్త ఉన్నప్పటికీ.. బాయ్ ఫ్రెండ్ పట్టించుకోవడం లేదని వివాహిత ఆత్మహత్య
Married Woman : ఏంట్రా ఇది.. భర్త ఉన్నా.. బాయ్ ఫ్రెండ్ మాట్లాడడం లేదని వివాహిత ఏం చేసిందంటే..?..!
Married Woman : వివాహేతర సంబంధాలు జీవితాలను చీల్చిపారేస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ తరహా సంఘటన ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. కుప్పం మండలానికి చెందిన ఓ 25 ఏళ్ల వివాహిత, సత్యవేలు అనే వివాహితుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఇద్దరికీ పెళ్లయినప్పటికీ, గుట్టుగా కొనసాగిన ఈ సంబంధం తర్వాత దారుణ ఘటనకు దారి తీసింది. సత్యవేలు ఇటీవల ఆమెను పట్టించుకోవడం మానేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ, చివరికి ఆ*హత్య చేసుకుంది.

Married Woman : ఏంట్రా ఇది.. భర్త ఉన్నా.. బాయ్ ఫ్రెండ్ మాట్లాడడం లేదని వివాహిత ఏం చేసిందంటే..?
Married Woman నా కన్నా నీ భార్య ముఖ్యంగా అంటూ ప్రియుడికి మెసేజ్ పెట్టి ఆ*హత్య చేసుకున్న వివాహిత
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్యవేలు తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలిపాడట. దీంతో మనస్తాపానికి గురైన మహిళ, ‘‘నీకు నా కన్నా నీ భార్యే ముఖ్యమా? నేను చనిపోతున్నా’’ అంటూ వాట్సాప్‌లో సందేశం పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తరువాత ఆమె ఆ*హత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతురాలి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు ఈ చాటింగ్‌లు దొరికాయి. దీంతో మహిళ మృతికి కారణమైన సత్యవేలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటన తర్వాత మృతురాలి బంధువులు ఆవేదనకు గురై సత్యవేలుపై చర్యలు తీసుకోవాలంటూ కుప్పం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా, అక్రమ సంబంధాలు ఎంత తీవ్రంగా ప్రాణాలకు ప్రమాదం కలిగించగలవో మరోసారి ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.