Big Breaking : టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించి రెండు విషయాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఒకటి భోళా శంకర్ సినిమా కాగా.. మరొకటి ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నారనే వార్తలు రావడం. నిజానికి మెగాస్టార్ రాజకీయాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది. ఆయన రాజకీయాలను వదిలేయడమే కాదు.. అసలు తన పార్టీని కూడా కాంగ్రెస్ లో కలిపేసి ఇక దాని జోలికి వెళ్లలేదు. అయితే.. ఇక్కడ మన చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. తన సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏపీలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చతికిలపడ్డారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నారు. కానీ.. 2024 ఎన్నికల్లో మాత్రం గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ.. వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
కట్ చేస్తే.. వాల్తేరు వీరయ్య 200వ రోజు ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని చిరంజీవి హింట్ ఇచ్చారా అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఏపీలో వైసీపీని ఓడించాలంటే తన బలం ఒక్కటే సరిపోదని.. అందుకే వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు పవన్. కానీ.. ఇంట్లోనే పవర్ ఫుల్ వ్యక్తి ఉండగా వేరే వాళ్లను బతిమిలాడటం ఎందుకని.. తన సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి జనసేనలోకి వస్తే ఇక జనసేన బలం రెట్టింపు అవుతుందని పవన్ భావిస్తున్నారట. అందుకే.. చిరంజీవిని జనసేనలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అందుకే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నట్టు హింట్ ఇచ్చారా? అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.