Minister Roja : తెలంగాణలో తరిమి కొడితే ఆంధ్రాకి వచ్చింది.. వైఎస్ షర్మిలపై రోజా కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Minister Roja : తెలంగాణలో తరిమి కొడితే ఆంధ్రాకి వచ్చింది.. వైఎస్ షర్మిలపై రోజా కామెంట్స్..!
Minister Roja : ఏపీ రాజకీయాలలో వైయస్ షర్మిల కేంద్రంగా మారారు. ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల వైయస్ జగన్ పై, చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా వైయస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. ఇక తాజాగా మంత్రి రోజా వైయస్ షర్మిలపై స్పందించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్ళు కాదన్నారు. తమతో ఉంటున్నది ఎవరో, తమ సమస్యల కోసం పోరాడింది ఎవరో, అధికారంలోకి వచ్చాక పరిష్కరించింది ఎవరో ప్రజలకు తెలుసని, ఇచ్చిన హామీలు నెరవేర్చింది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రోజా పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఓటు, ఇక్కడే ఇల్లు కట్టుకొని, ప్రజల మధ్య ఉంటున్న ప్రజానాయకుడు జగనన్న అని ఆమె కొనియాడారు.
రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారని, ఎన్ని కష్టాలు ఎదురైనా కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఏరోజు తగ్గలేదని, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోలేదని, ఏ పార్టీలో విలీనం చేయలేదని, అది నాయకుడి లక్షణం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రోజా కొనియాడారు. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి అక్కడ ప్రజలు ఛీ కొడితే ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు అని వైయస్ షర్మిలపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదని, బాగున్న రాష్ట్రాన్ని ముక్కలుగా చేసినది కాంగ్రెస్ పార్టీ అని, రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన వైయస్సార్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని, వైయస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ రోడ్డుకి ఈడ్చిందని, ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసిన జీరోలే అవుతారని, సామాన్య కార్యకర్తలు కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెబుతుందని మంత్రి రోజా పేర్కొన్నారు. దీంతో మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు వైయస్ షర్మిల ఎలా స్పందిస్తారో మరి. వైయస్ షర్మిల కూడా మరీ దూకుడుతనంగా వ్యవహరిస్తున్నారు. ఆమె చేసే అతివలన వైయస్ జగన్ కి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై వైయస్ జగన్ పై వార్ ని ప్రకటించాయి. ఇక ప్రజలు ఎవరికి పట్టం కడతారో కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ పోతున్నారు.