Minister Roja : న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో కూతురుతో కలిసి పబ్ లో రచ్చ చేసిన మంత్రి రోజా .. వైరల్ వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister Roja : న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో కూతురుతో కలిసి పబ్ లో రచ్చ చేసిన మంత్రి రోజా .. వైరల్ వీడియో..!!

 Authored By anusha | The Telugu News | Updated on :2 January 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Minister Roja : న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో కూతురుతో కలిసి పబ్ లో రచ్చ చేసిన మంత్రి రోజా .. వైరల్ వీడియో..!!

Minister Roja : సినీ నటి, వైయస్సార్ సీపి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి రోజా సెల్వమణి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల కాలంలో రకరకాల సంఘటనలు కారణంగా రోజాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రోజా సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి. ఆమె తీరును నెటిజెన్లు ముఖ్యంగా ఓ పార్టీ సానుభూతిపరులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో రోజా బాగా పాపులర్ అవుతున్నారు. ఆంధ్రాలో ఆడుకుందాం రా అనే కార్యక్రమంలో ఆమెకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి క్రికెట్ బ్యాటింగ్ నేర్పించడం వైరల్ అయింది. ఆ వీడియోను ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ రిలీజ్ అయి భారీ ఎత్తున వైరల్ అయింది.

ఇక నూతన సంవత్సర వేడుకలను మంత్రి రోజా ఘనంగా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్ కు ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరు పబ్బులో డాన్సులు చేస్తూ పాటలకు స్టెప్పులు వేస్తూ న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించారు. అయితే బెంగళూరు పబ్బులో రోజా డాన్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మంత్రిగా ఉండి పబ్బులో డాన్స్ లు ఏంటి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై నిరసనలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమీ పట్టవా..? బెంగళూరు పబ్బుల్లో చిందులు వేస్తారా అంటు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఇక గతంలో అఖిలప్రియ భూమా పై రోజా చేసిన కామెంట్స్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలుగు వాళ్లకు ఒక సాంప్రదాయం ఉంది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో సాంప్రదాయంగా ఉండాలి. మంత్రిగా చుడీదార్ వేసుకొని రావడం తప్పు. ప్రజాసేవలో లేకపోతే నైటీ వేసుకున్న పర్వాలేదు. ఎవరు పట్టించుకోరు అని రోజా ఘాటుగా కామెంట్ చేశారు. తర్వాత ఆమె గతంలో మాట్లాడిన వీడియోలను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉండి చేసింది ఏమిటి అని నిలదీస్తున్నారు. నీతులు చెప్పేముందు వాటిని ఆచరించాలని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో రోజాతో పాటు తన కూతురు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది