
Minister Seethakka : తంభీ తర్వాత నువ్వు , నీ అయ్యే.. కేటీఆర్ , కేసీఆర్‌లపై రెచ్చిపోయిన సీతక్క..!
Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలోని తుక్కుగూడలో ఇటీవల జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తోపాటు మినీస్టర్ సీతక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు…ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏండ్ల కేసీఆర్ గడీల పాలనను పాత రేసి ప్రజాపాలన తీసుకువచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు కూడా కలుపుకొని గత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలని కలలు కన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి వారి కలలని కల్లీలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారు.
రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఇప్పటికీ దాదాపు 30 ఏళ్లు కావస్తున్న ఇందిరమ్మ కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం దేశ నలుమూలలకు తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటుపడుతున్నారు ,పోరాడున్నారు ,ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వారు పదవిని స్వీకరించలేదని సీతక్క తెలియజేశారు. కావున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. కావున కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని సీతక్క తెలిపారు.
Minister Seethakka : తంభీ తర్వాత నువ్వు , నీ అయ్యే.. కేటీఆర్ , కేసీఆర్‌లపై రెచ్చిపోయిన సీతక్క..!
ఈ క్రమంలోనే దేశ అభివృద్ధి ఏదని మోడీని అడిగితే …. అయోధ్యను చూపిస్తున్నారు.. అక్షింతలు పంపిస్తున్నారు కానీ దేశ అభివృద్ధి మాత్రం మోడీ చూపించలేకపోతున్నారనిసీతక్క ఎద్దెవ చేశారు. అక్షింతలు అయితే ఇంటికి వచ్చాయి కానీ కేంద్రం నుండి రావాల్సిన పథకాలు, జరగాల్సిన అభివృద్ధి మాత్రం జరగలేదంటూ సీతక్క చెప్పుకొచ్చారు. అలాగే జన్ ధన్ ఖాతాలను ధన్ ధన్ తెరవమని అన్నారు కానీ 15 లక్షలు ఇచ్చిండా అని సీతక్క ప్రశ్నించారు. మరి 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ దేశానికి ఏం చేసిండు అంటే.. రాస్తే రామాయణం అంత , చెప్తే భారతమంతా అయితది తప్ప మరొకటి లేదంటూ సీతక్క తెలియజేశారు. కానీ మన రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిధి , ప్రజల సన్నిధి, త్యాగాల వారధి , కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మహా నాయకుడు , కాబట్టి ఇలాంటి గొప్ప నాయకుడికి ఒక్క అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిందిగా సీతక్క కాంగ్రెస్ నేతలను కోరారు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.