Minister Seethakka : తంభీ త‌ర్వాత నువ్వు , నీ అయ్యే.. కేటీఆర్ , కేసీఆర్‌ల‌పై రెచ్చిపోయిన‌ సీత‌క్క‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Minister Seethakka : తంభీ త‌ర్వాత నువ్వు , నీ అయ్యే.. కేటీఆర్ , కేసీఆర్‌ల‌పై రెచ్చిపోయిన‌ సీత‌క్క‌..!

Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలోని తుక్కుగూడలో ఇటీవల జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తోపాటు మినీస్ట‌ర్‌ సీతక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ మాజీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Minister Seethakka : తంభీ త‌ర్వాత నువ్వు , నీ అయ్యే.. కేటీఆర్ , కేసీఆర్‌ల‌పై రెచ్చిపోయిన‌ సీత‌క్క‌..!

Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలోని తుక్కుగూడలో ఇటీవల జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తోపాటు మినీస్ట‌ర్‌ సీతక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు…ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏండ్ల కేసీఆర్ గడీల పాలనను పాత రేసి ప్రజాపాలన తీసుకువచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు కూడా కలుపుకొని గత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలని కలలు కన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి వారి కలలని కల్లీలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారు.

Minister Seethakka గడీల పాలనను పాత రేసి ప్రజ‌లు

రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఇప్పటికీ దాదాపు 30 ఏళ్లు కావస్తున్న ఇందిరమ్మ కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం దేశ నలుమూలలకు తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటుపడుతున్నారు ,పోరాడున్నారు ,ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వారు పదవిని స్వీకరించలేదని సీతక్క తెలియజేశారు. కావున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. కావున కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణ‌లో  17 ఎంపీ సీట్లు గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని సీతక్క తెలిపారు.

Minister Seethakka తంభీ త‌ర్వాత నువ్వు నీ అయ్యే కేటీఆర్ కేసీఆర్‌ల‌పై రెచ్చిపోయిన‌ సీత‌క్క‌

Minister Seethakka : తంభీ త‌ర్వాత నువ్వు , నీ అయ్యే.. కేటీఆర్ , కేసీఆర్‌ల‌పై రెచ్చిపోయిన‌ సీత‌క్క‌..!

ఈ క్రమంలోనే దేశ అభివృద్ధి ఏదని మోడీని అడిగితే ….  అయోధ్యను చూపిస్తున్నారు.. అక్షింతలు పంపిస్తున్నారు కానీ దేశ అభివృద్ధి మాత్రం మోడీ చూపించలేకపోతున్నారనిసీతక్క ఎద్దెవ చేశారు. అక్షింతలు అయితే ఇంటికి వచ్చాయి కానీ కేంద్రం నుండి రావాల్సిన పథకాలు, జరగాల్సిన అభివృద్ధి మాత్రం జరగలేదంటూ సీతక్క చెప్పుకొచ్చారు. అలాగే జన్ ధన్ ఖాతాలను ధన్ ధన్ తెరవమని అన్నారు కానీ 15 లక్షలు ఇచ్చిండా అని సీతక్క ప్రశ్నించారు. మరి 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ దేశానికి ఏం చేసిండు అంటే.. రాస్తే రామాయణం అంత , చెప్తే భారతమంతా అయితది తప్ప మరొకటి లేదంటూ సీతక్క తెలియజేశారు. కానీ మన రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిధి , ప్రజల సన్నిధి, త్యాగాల వారధి , కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మహా నాయకుడు , కాబట్టి ఇలాంటి గొప్ప నాయకుడికి ఒక్క అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిందిగా సీతక్క కాంగ్రెస్ నేతలను కోరారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది