Pawan Kalyan : వైసీపీ భారీ ఛాలెంజ్ విసిరింది.. సిద్ధమా పవన్?
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం అధికార వైసీపీ, జనసేన పార్టీ మధ్య నడుస్తున్నాయి. ఇన్ని రోజులు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉండేది కానీ.. ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగానే ఉంది. అవును.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నడుస్తోంది. ఆ యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత, సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఊ అంటే జగన్.. ఆ అంటే జగన్.. అసలు వారాహి యాత్రను ప్రారంభించిందే సీఎం జగన్ ను, ఏపీ ప్రభుత్వాన్ని తిట్టేందుకు అన్నట్టుగా ఉంది పవన్ తీరు.
అదంతా పక్కన పెడితే వైసీపీ నేత, ఏపీ మంత్రి విశ్వరూప్.. పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని ఉందని మంత్రి విశ్వరూప్ తిరుమల వెంకన్న సాక్షిగా సవాల్ విసిరారు. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ సీఎం కావడం అసంభవం. అందుకే.. పవన్ ను సీఎంగా చూడాలని ఉందన్నారు. కేవలం పవన్ అభిమానులకే కాదండి.. నాకు కూడా పవన్ ను సీఎంగా చూడాలని ఉందన్నారు. అంటే.. 175 స్థానాల్లో జనసేన పోటీ చేసి 88 స్థానాలను దక్కించుకొని పవన్ సీఎం కావాలని మంత్రి విశ్వరూప్ చెప్పుకొచ్చారు.
Pawan Kalyan : టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం 100 సీట్లు అయినా వస్తాయి కదా
ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కనీసం 100 సీట్లలో అయినా జనసేనను పోటీ చేయిస్తే అందులో కనీసం 50 స్థానాల్లో అయినా గెలవాలంటూ సూచించారు. పవన్ కళ్యాణ్ కు ఇంత మంచి సూచన చేసిన వాళ్లలో ఈయన ఒక్కరే అనుకోవాలి. అయితే.. ఇదేదో.. పవన్ మీద మంత్రి విశ్వరూప్ చూపిస్తున్న అభిమానం అనుకునేరు. అదేం కాదు.. పవన్ కళ్యాణ్ మీద ఆయన సెటైర్ వేశారు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్లకే ఆయన వ్యాఖ్యలు అర్థం అవుతాయి.