pawan kalyan : ఎగిరితే అలాగే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గాలి మొత్తం తీసేసిన అన్నారాంబాబు
pawan kalyan: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం సింగరపల్లిలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిట్టడం వల్లే ఆయన అనుచరులు ఇబ్బందులు పెట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ జనసేన నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగాడు. జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా వెంగయ్య ఆత్మహత్య కు కారణం అయిన ఎమ్మెల్యే రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశాడు. దాంతో ఎమ్మెల్యే రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

MLA Anna Rambabu comments on janasenani pawan kalyan
పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే చాలెంజ్.. Anna Rambabu
వెంగయ్య ఆత్మహత్య విషయంలో తనను టార్గెట్ చేశారంటూ ఎమ్మెల్యే రాంబాబు అంటున్నారు. వెంగయ్య కుటుంబ సభ్యులు స్వయంగా ఆత్మహత్యకు ఎమ్మెల్యే కారణం కాదని చెప్పారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ ప్రయోజనం కోసం వెంగయ్య ఆత్మహత్యను ఉపయోగించుకుంటున్నాడు. ఈ సమయంలో తాను పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక వేళ వెంగయ్య ఆత్మహత్యకు కనుక నేను కారణం అని తేలితే ఖచ్చితంగా న్యాయ స్థానం ముందు లొంగి పోతాను. నా నేరంను దమ్ముంటే జనసేన నాయకులు లేదా కార్యకర్తలు ఎవరైనా సరే నిరూపించాలంటూ ఛాలెంజ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అంటూ అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఒక్క సీటు వస్తేనే ఇంత చేస్తే జనసేనకు అధికారం వస్తే..
తాను గతంలో ఇదే గిద్దలూరు నుండి ప్రజారాజ్యం తరపును పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీ అధినేత మరీ అరాచకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన తీరు చూస్తుంటే మెజార్టీ వస్తే రాష్ట్రంను అల్ల కల్లోలం చేసేలా ఉన్నాడు. తెలుగు దేశం పార్టీ తాలూకు రాజకీయంను పవన్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో పవన్ రాజకీయం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. వీరికి అనుభవ రాహిత్యం వల్ల రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారు. ఇలా చావు రాజకీయాలకు పవన్ పాల్పడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.