Modi : పండగవేళ మోడీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Modi : పండగవేళ మోడీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2025,6:20 pm

Modi  : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు భారీ షాక్ తగిలింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రకటించినా, వాటిలో ఎటువంటి మార్పు చేయకపోవడం ద్వారా పొదుపుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మోదీ సర్కార్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు పెట్టుకున్న వారు నిరాశ చెందాల్సి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Modi పండగవేళ మోడీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్

Modi : పండగవేళ మోడీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్

ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 28, 2025న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మార్చలేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై 7.1%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)పై 7.7%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)పై 8.2%, సుకన్య సమృద్ధి యోజన (SSY)పై 8.2% వడ్డీ అమలులో ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్‌పై 4%, 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9%, 2 సంవత్సరాలపై 7%, 3 సంవత్సరాలపై 7.1%, 5 సంవత్సరాలపై 7.5%, 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 6.7% వడ్డీ ఉంటుంది.

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను త్రైమాసిక సమీక్ష ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు.. ఈ పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ల దిగుబడికి అనుగుణంగా ఉంటాయి. 2024 ప్రారంభంలో కొన్ని పథకాలపై వడ్డీ రేట్లు పెంచినప్పటికీ, ప్రస్తుతం ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో పెట్టుబడిదారులు నిరాశ చెందుతున్నారు. పొదుపుదారులకు మెరుగైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది