Modi Cabinet : మోదీ జ‌ట్టులో తెలుగు రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Modi Cabinet : మోదీ జ‌ట్టులో తెలుగు రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులు ఇవే..!

Modi Cabinet : ఈ రోజు రాత్రి న‌రేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. మోదీ ప్ర‌మాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, ముచ్చ‌ట‌గా మూడోసారి ఆయ‌న ప్ర‌ధాని కానున్నారు. మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. మోదీ తన మంత్రివర్గంలో దాదాపు 30 మందికి అవకాశం కల్పించారని తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2024,2:03 pm

ప్రధానాంశాలు:

  •  Modi Cabinet : మోదీ జ‌ట్టులో తెలుగు రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులు ఇవే..!

Modi Cabinet : ఈ రోజు రాత్రి న‌రేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. మోదీ ప్ర‌మాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, ముచ్చ‌ట‌గా మూడోసారి ఆయ‌న ప్ర‌ధాని కానున్నారు. మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. మోదీ తన మంత్రివర్గంలో దాదాపు 30 మందికి అవకాశం కల్పించారని తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది.

Modi Cabinet : కేంద్ర క్యాబినేట్‌లో అవ‌కాశం..

ఈ మేరకు ఇద్దరు ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ పెమ్మసానికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కినట్లు సమాచారం. మంత్రివర్గం కూర్పు మీద కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం.. టీడీపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటుగా, గుంటూరు ఎంపీగా తొలిసారిగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అయితే రామ్మోహ‌న్ నాయుడికి హెల్త్ మినిస్ట‌ర్ ప‌దవి ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

కాగా, కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రి ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఆయన మాత్రం విజయం సాధించారు. ఈసారి శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై 3,14,107 మెజార్టీతో గెలుపొందారు. ఎర్రన్నాయుడు మరణాంతరం 2012లో రాజకీయాల్లోకి వచ్చారు.రామ్మోహన్ నాయుడికి మంచి వాక్చాతుర్యం ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఈ క్ర‌మంలోనే రామ్మోహన్ నాయుడు పేరును కేబినెట్ బెర్త్ కోసం టీడీపీ సిఫార్సు చేసిన్నట్లు టాక్. ఎ కొత్త ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి దక్కినందుకు నా మిత్రుడు రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు.. మీ చిత్తశుద్ధి, నిరాడంబరత దేశాభివృద్ధికి నిశ్చయంగా తోడ్పడతాయి. కొత్త పాత్రను సమర్ధవంతంగా పోషించాలని కోరుకుంటున్నాను’ అని గల్లా ట్వీట్ చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Modi Cabinet మోదీ జ‌ట్ట‌లో తెలుగ రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులు ఇవే

Modi Cabinet : మోదీ జ‌ట్ట‌లో తెలుగ రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులు ఇవే..!

ఇక తెలంగాణ నుంచి కేంద్రమంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు పిలుపు అందింది. పీఎంవో పిలుపుతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మోదీ నివాసానికి వెళ్లారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది