Awas yojana scheme : సామాన్యులకు మోదీ శుభవార్త… ఆవాస్ యోజన పథకం పై కీలక నిర్ణయం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Awas yojana scheme :  సామాన్యులకు మోదీ శుభవార్త… ఆవాస్ యోజన పథకం పై కీలక నిర్ణయం…

Awas yojana scheme : కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం మనకు తెలిసినదే. దీనిలో భాగంగా పేద మరియు మధ్యంతర కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే మన దేశంలో ఇప్పటికీ కూడా సొంత ఇల్లు అంటూ లేని వారు ఎంతో మంది ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సొంతింటి కలను తీర్చడానికి ఎన్నో పతకాలను కూడా అమలు చేస్తున్నారు. అయినా కూడా ఇంకా ఎంతోమంది […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Awas yojana scheme :  సామాన్యులకు మోదీ శుభవార్త... ఆవాస్ యోజన పథకం పై కీలక నిర్ణయం...

Awas yojana scheme : కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం మనకు తెలిసినదే. దీనిలో భాగంగా పేద మరియు మధ్యంతర కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే మన దేశంలో ఇప్పటికీ కూడా సొంత ఇల్లు అంటూ లేని వారు ఎంతో మంది ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సొంతింటి కలను తీర్చడానికి ఎన్నో పతకాలను కూడా అమలు చేస్తున్నారు. అయినా కూడా ఇంకా ఎంతోమంది అద్దే ఇంట్లోనే ఉంటున్నారు. వారి కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నది.ఈ పథకం ద్వారా ఇంటిని నిర్మించుకునేందుకు సబ్సిడీని పొందవచ్చు..

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకము యొక్క సబ్సిడీ సొమ్మును పెంచేందుకు ప్రధానమంత్రి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందింది. అయితే 2024 -25 బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ పీఎం ఆవాస్ యోజన కోసం రూ.80.671 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, అద్దె ఇల్లు మరియు కాలనీలో ఉండే వారి సొంత ఇంటి కలను నిజం చేసుకోవటానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వ మీకు సహాయం చేస్తుంది అని తెలిపారు. అయితే ఈ లోన్ వడ్డీ రేటు తో మీరు 20 ఏళ్ల పాటు 2.67 లక్షల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ సబ్సిడీ అనేది కుటుంబంలో ఎవరికి సొంత ఇల్లు అంటూ లేని వారికే వస్తుంది. ఈ EWS కేటగిరికి చెందిన వారు అయితే వారి వార్షిక ఆదాయం రూ. 3లక్షల లోపు ఉండాలి. అలాగే దరఖాస్తుదారుని పేరు మరియు రేషన్ కార్డు లేక బిపిఎల్ జాబితాలో ఉండి తీరాలి. అలాగే దరఖాస్తు చేసేవారు ఓటర్ జాబితాలో తన పేరు కచ్చితంగా ఉండి తీరాలి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉండి తీరాలి.అయితే లోన్ కోసం మీరు అప్లై చేయడానికి దరఖాస్తు చేసే వారి వయసు 18 ఏళ్లు ఉండాలి.అయితే అప్పుడు మీకు గరిష్టంగా రూ.12 లక్షల వరకు లోన్ అనేది వస్తుంది. అలాగే వార్షిక వడ్డీలో 3% రాయితీ కూడా మీకు వస్తుంది. మీరు ఈ మొత్తాన్ని కూడా లోన్ నుండి ముందస్తుగా తగ్గించుకోవచ్చు…

Awas yojana scheme సామాన్యులకు మోదీ శుభవార్త ఆవాస్ యోజన పథకం పై కీలక నిర్ణయం

Awas yojana scheme :  సామాన్యులకు మోదీ శుభవార్త… ఆవాస్ యోజన పథకం పై కీలక నిర్ణయం…

అనగ 5.80 లక్షల మాత్రమే EMI అనేది కట్టాల్సి ఉంటుంది. అయితే రూ. 6 లక్షల నుండి రూ.12 లక్షల మధ్య లోన్ పై సబ్సిడీ 3 నుండి 6.50% వరకు ఉంటుంది. అయితే ఈ లోన్ బడ్జెట్లో రూ.18 లక్షల వరకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ దరఖాస్తులు సమర్పించడానికి PMAY వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. దాని తర్వాత మీకు వర్తించే కేటగిరిని ఎంచుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ ఆధార్ కార్డు నెంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ పూర్తి వివరాలు దరఖాస్తు ఫారమ్ లో నింపాలి. దీనిలో వ్యక్తిగత సమాచారం మరియు అడ్రస్, ఆదాయ వివరాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఫారమ్ ను ఇచ్చే ముందు దీనికి సంబంధించిన మొత్తం సమాచారం సరిగ్గా ఉందో లేదో ఒకసారి సరి చూసుకోవాలి. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY (G) యొక్క పథకం కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇండ్లను నిర్మిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. అయితే మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఆమె దీని గురించి తెలిపారు. కరోనా ఉన్నప్పుడు PMAY పథకాన్ని అమలు చేశాము అని ఆమె తెలిపారు. అయితే ఈ పథకం కింద గ్రామంలో భారీగా ఇళ్లను కట్టిస్తామని, తొందరలోనే మూడు కోట్ల వరకు ఇల్లు కట్టించే టార్గెట్ ఉంది అని తెలిపారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది