Mohan Babu : చంద్రబాబు ఒక పెద్ద దొంగ.. ఒరేయ్ నువ్వు జైలులోనే మగ్గి మగ్గి చావాలి.. మళ్లీ జగనే సీఎం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mohan Babu : చంద్రబాబు ఒక పెద్ద దొంగ.. ఒరేయ్ నువ్వు జైలులోనే మగ్గి మగ్గి చావాలి.. మళ్లీ జగనే సీఎం

 Authored By kranthi | The Telugu News | Updated on :5 October 2023,3:00 pm

Mohan Babu : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై తాజాగా మోహన్ బాబు స్పందించారు. చంద్రబాబు గురించి మీకన్నా నాకే ఎక్కువగా తెలుసు. దాదాపు 40 ఏళ్ల నుంచి చంద్రబాబుతో సావాసం చేశాను. ఆయన గురించి నాకంటే ఎక్కువ ఎవ్వరికీ తెలియదు. అతడు పుట్టుకతోనే అసత్యాలు, అబద్ధాలు మాట్లాడటం అతడి రక్తంలో జీర్ణించుకుపోయింది. టీడీపీ పార్టీ ఎవరిది.. చెప్పండి. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు మానేసి తన కుమారుడు హరికృష్ణతో ట్రావెల్ చేసి టీడీపీని స్థాపించి భారతదేశంలో శభాష్ అనిపించుకున్నారు అన్నయ్య ఎన్టీఆర్. ఆ మహానుభావుడు ఈ చంద్రబాబుకు కన్యాదానం చేస్తే ఆ మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబునాయుడు. అసలు అంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్లడం జరిగింది. అన్నయ్య వైస్రాయ్ హోటల్ కి వస్తే.. ఎందుకు బయటికి వచ్చారు.. ఒకసారి రండి.. మాట్లాడుదాం అని అన్నయ్య అంటే… టప్పటప్ప చెప్పులు విసిరారు అన్నయ్య మీద.

ఇది వాస్తవం.. భగవంతుడి సాక్షిగా కళ్లారా చూశాను నేను. అన్నయ్య మరణం తర్వాత ఒక సారి ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు మంచివాడు ఓట్లేయండి అని చెప్పాను. కరెక్ట్ గా 6 నెలల తర్వాత నన్ను తీసేశాడు. కరివెపాకులా తీసేస్తాడు ఎవ్వరినైనా. ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ ఉంటాడు చంద్రబాబు. చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం అది. అన్నయ్య సభ్యత్వాన్ని కూడా తీసేసిన తెలుగుదేశం అది. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. హరికృష్ణను వాడుకున్నాడు. హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకున్నాడు. సుహాసినిని వాడుకున్నాడు. ఎవరైనా బాగున్నారు అంటే.. వాళ్లను తీసుకొచ్చి సర్వనాశనం చేసేస్తాడు నా స్నేహితుడు అనబడే చంద్రబాబు. ఇలాంటి దగుల్బాజీ ఉంటాడా అంటూ ఎన్టీఆర్ ఎంతో ఘోషించారు.

mohan babu shocking comments on chandrababu and praises jagan

#image_title

Mohan Babu : రాజశేఖర్ రెడ్డి ఒక మాట చెబితే అది వేదమే?

చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఏది చెబితే అది వేదం. ఆయన ఒక మాట చెబితే అది వేదం. ఒక పద్ధతి ఉన్న మనిషి. కాంగ్రెస్ లో పోరాడి నిద్రహారాలు మాని.. పాదయాత్ర చేసి రైతుల కష్టసుఖాలు తెలుసుకొని సంకల్పించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అందుకే.. చంద్రబాబుకు, రాజశేఖర్ రెడ్డికి నక్కకు నాగలోగానికి ఉన్నంత సంబంధం ఉంది. చంద్రబాబు ఎందుకు అరెస్ట్ అయ్యారో.. చంద్రబాబు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని.. తను ఇప్పటి వరకు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని మోహన్ బాబు స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది