Vijayasai Reddy : లంచాలు తినేసి చంద్రబాబు జైలుకి పోతే బయట కంచాలు మోగిస్తున్నారా? రాడ్డు దింపిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన గళం వినిపిస్తోంది. వైసీపీ నేతలు అయితే పండుగ చేసుకుంటున్నారు. కొందరు వైసీపీ నేతలు అయితే అసలు చంద్రబాబు అరెస్ట్ పై మామూలు సంతోషంగా లేరు. దొరికారురా అని అందరు టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు ఫ్యామిలీని కూడా లాగుతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. మోత మోగిద్దాం అని చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఒక కార్యక్రమాన్ని టీడీపీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మోత మోగిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా డోలు కొట్టి, విజిల్ ఊదారు టీడీపీ నేతలు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. తాజాగా ఆ కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
మోత మోగిస్తారట. నేను మూడు ప్రశ్నలు అడుగుతున్నా.. లంచాలు తీసుకొని కంచాలు కొడతారా? రెండోది.. బకాసురుడి లాగా.. బాకసురుడి బావమరుదులు అందరూ శ్రీకృష్ణుడి వేషం వేస్తారా? అవినీతికి పాల్పడి సిగ్గు పడాల్సిన వాళ్లంతా సింగారించుకొని బయటికి వచ్చి కంచాలు మోగిస్తారా? అని టీడీపీ కార్యకర్తలు, నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. మోగించినటువంటి అవినీతి ఏదైతే ఉందో.. ఆ అవినీతి మోత కారణంగానే ఈరోజు చంద్రబాబు ఇంట్లో ఈగలు మోత, జైలులో దోమల మోతలా ఉంది. అందుకే ఆయన ఈరోజు ఈ పరిస్థితికి దిగజారారు. అరెస్ట్ చేసింది సీఐడీ.. అన్నది అందరికీ తెలుసు. సీఐడీ అరెస్ట్ ను, రిమాండ్ ను క్లాష్ చేయడానికి సీబీఐ కోర్టుకు, హైకోర్టుకు, సుప్రీంకు కూడా వెళ్లారు. ఎక్కడా వాళ్లకు రిలీఫ్ దొరకలేదు. ఈ మూడు కోర్టులు నిరాకరించాయి. దీంతో ఈరోజు ఆయన రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు.
Vijayasai Reddy : కంచాలు ఎవరి కోసం మోగిస్తున్నారు?
కంచాలు ఎవరి కోసం మోగిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమా? ఎవరి కోసం విజిల్ వేస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు చేసిన పని ఏంటి? నిరుద్యోగుల కంచాల్లో అన్నం పెట్టి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్లకు చెందాల్సిన డబ్బును తినేసి, దోచుకొని ప్రతి విషయంలోనూ ఐదు సంవత్సరాలు అడ్డంగా తినేసి బకాసురులు కంచాలు మోగించి ఏం సాధిస్తారు. ఏ మొహం పెట్టుకొని అవినీతికి పాల్పడిన వ్యక్తి న్యాయస్థానాలను అపహాస్యం చేస్తాడు. చట్టాన్ని ఎలా అపహాస్యం చేస్తాడు. అవినీతి అనేది అక్రమం. అరెస్ట్ అనేది సక్రమం.. అలాంటప్పుడు అవినీతి సక్రమం, అరెస్ట్ అక్రమం అనేటువంటి వాళ్లను ఏమనాలి.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.