Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

 Authored By ramu | The Telugu News | Updated on :9 May 2025,2:05 pm

ప్రధానాంశాలు:

  •  Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్
అమరుడయ్యారు.

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik వీరుడా.. వందనం

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలో కన్నుమూశాడు. మురళీ నాయక్ మరణంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వీర జవాన్ ఈ దంపతుల ఏకైక సంతానం కావటం గమనార్హం.

మురళీ నాయక్.. పాకిస్థాన్ జవానుల కాల్పుల్లో అమరుడయ్యారా?.. లేదంటే ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమణం పొందారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మురళీ నాయక్ మృతిపై ఇండియన్ ఆర్మీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.తెలుగు జవాన్ మురళినాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మురళీ నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని ట్వీట్స్ చేస్తున్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి