Nagababu VS Ali : రాజకీయ మాటల యుద్ధం.. నాగబాబు VS ఆలీ..!
ప్రధానాంశాలు:
Nagababu VS Ali : రాజకీయ మాటల యుద్ధం.. నాగబాబు VS ఆలీ..!
Nagababu VS Ali : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీని గద్దెదించడానికి జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఇక బీజేపీ కూడా జనసేన టీడీపీ తో కలుస్తుందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. కానీ పరోక్షంగా బీజేపీ కూడా జనసేన టీడీపీ లతో టచ్ లో ఉంటుందని వారికి మరింత బలాన్ని ఇస్తుందని అంటున్నారు. జనసేన పార్టీ నేతలు వైసీపీ పై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. భూకబ్జాలు చేసే ప్రజలను బాధపెట్టారు. మన దేశంలో ఇంతవరకు ఇలాంటి చెత్త రాష్ట్ర ప్రభుత్వం రాలేదు.
ఆ పథకాలు ఈ పథకాలు అందించామని చెబుతున్నారు. కానీ అవి ప్రజల మీద వేసిన పన్నులు ద్వారానే తిరిగి వాళ్లకి ఇస్తున్నారు అని అన్నారు. ఇక పథకాలకి వాళ్ళ తాత తండ్రుల పేర్లు పెడతారు కానీ జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చాక మహనీయుల పేర్లను పథకాలకు పెడతామని అన్నారు. జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ప్రజల సమస్యలకు పోరాడుతామని అన్నారు. ప్రజలు పెద్ద పెద్ద కోరికలేమి కోరడం లేదని వాళ్ళకి త్రాగటానికి మంచి నీరు ఉండటానికి ఇల్లు ఉపాధి అవకాశాలు ఫ్యాక్టరీలు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వైసీపీ ఇవన్నీ ఆలోచించకుండా ఎక్కడ భూ కబ్జా చేసేద్దామా పరిశ్రమలను తీసుకురాకుండా చేశారు. ఇక తాజాగా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆలీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానో విషయం నాకు కూడా తెలియదు. సీఎం ఆఫీస్ నుంచి రావాల్సి ఉంది ముఖ్యమంత్రి పిలిచి ఫలానా చోటు నుంచి పోటీ చేయమంటే అందుకు సిద్ధంగా ఉన్నా. ఈ వారంలో కబురు రావచ్చు .
ఏ పార్టీలో ఉన్న పోటీలో నిలబడిన వ్యక్తి మంచివారైతే ప్రజలు గెలిపిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్న అంతిమ నిర్ణయం ఓటర్ దే. ఎన్నికలకు మేము సిద్ధం అంటున్నాం వాళ్లు సిద్ధం అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో అని ఆలీ అన్నారు. ఇక కొన్నేళ్ల కిందటే ఆలీ వైకాపాలో చేరారు. గత ఎన్నికల్లో పోటీ చేయమని అడిగితే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా రాజకీయాల్లో అడుగుపెడితే ఇబ్బంది పడతానని దృష్టితో పోటీ చేయలేదన్నారు. అంతేకాకుండా అప్పటికి ఒప్పుకున్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయంతో తిరస్కరించినట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వ సలహాదారులలో ఒకరిగా ఆలీ నియమితులయ్యారు.