వామ్మో లోకేశా..? ఇదేమి స్పీచ్.. దళిత కార్డు తో జగన్ చెక్ పెట్టాలనే ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

వామ్మో లోకేశా..? ఇదేమి స్పీచ్.. దళిత కార్డు తో జగన్ చెక్ పెట్టాలనే ?

 Authored By brahma | The Telugu News | Updated on :5 April 2021,10:40 am

టీడీపీ యువనేత నారా లోకేష్ బాబు తాజాగా జరుగుతున్నా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. పైగా తన ప్రసంగాల శైలి మార్చుకొని గతంలో కంటే కొత్తగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి తోడు తన మాటలకు పదును పెట్టిమరీ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నాడు.. ముఖ్యంగా వైసీపీ కి కీలక ఓటు బ్యాంకు గా మారిన దళితుల విషయం మాట మాటకి లేవదీస్తూ జగన దళిత వ్యతిరేకి అనే ముద్ర వేయాలని చినబాబు బాగా కష్టపడుతున్నాడు.. ఈ సందర్భంలో లోకేష్ మాట్లాడిన మాటలు ఏమి చూద్దాం..

Nara lokesh Comments on Ys Jagan

Nara lokesh Comments on Ys Jagan

జగన్ రెడ్డి పేరు మార్చా ఆయన పేరు సైకో రెడ్డి.ఎందుకో తెలుసా ఆయనకు దళితులు అంటే కోపం.తిరుపతి ఎంపీగా ఉన్నప్పుడు బల్లి దుర్గాప్రసాద్ గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారు.దళితుడనే కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయన మీడియా ద్వారా బాధని వ్యక్తం చేసారు. దళిత నేత చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి వెళ్లని సైకో రెడ్డి ఆయన సామజిక వర్గం ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి చనిపోతే స్పెషల్ ఫ్లైట్ లో క్షణాల్లో వాలిపోయాడు.

Nara Lokesh : ఎమ్మెల్యే  చనిపోతే శవం పక్కన నిలబడి నవ్వుతున్నాడు

బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబయ్య దళిత నేత చనిపోతే అక్కడికి వెళ్లి శవం పక్కన నిలబడి నవ్వుతున్నాడు. ముఖ్యమంత్రి పక్కన దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు నిలబడాలి,మంత్రి పెద్ది రెడ్డి దర్జాగా కూర్చుంటాడు. చిత్తూరు లో మంత్రి పెద్ది రెడ్డి అవినీతి ప్రశ్నించినందుకు దళిత మెజిస్ట్రేట్ రామకృష్ణ గారిని వెంటాడి వేధిస్తున్నారు. అక్రమ మద్యం మాఫియా ని ప్రశ్నించాడు అని దళిత యువకుడు ఓం ప్రతాప్ ని చంపేశారు.

మాస్క్ పెట్టుకోలేదు అంటూ చీరాల లో దళిత యువకుడు కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ ఇసుక మైనింగ్ ని ప్రశ్నించాడు అని దళిత యువకుడు వర ప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు. విశాఖ లో మాస్క్ అడిగారని డాక్టర్ సుధాకర్ గారిపై పిచ్చివాడనే ముద్ర వేసారు. చిత్తూరు జిల్లా లో డాక్టర్ అనితా రాణి గారు వైకాపా నాయకుల అవినీతి కి సహకరించలేదు అని బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు. ఇప్పుడు చెప్పండి దళితులను వేధిస్తున్న జగన్ రెడ్డిని సైకో రెడ్డి అనడం తప్పా? అంటూ లోకేష్ ప్రసంగం సాగింది..

ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, లోకేష్ ఎలాంటి ప్రసంగాలు ఎన్ని చేసిన కానీ దళితులను జగన్ కు దూరం చేయటం అనేది కష్టమైన విషయం అనే చెప్పాలి.. రాష్ట్రంలో దళిత వర్గాల్లో సాలిడ్ ఓటు కలిగి ఉన్నాడు జగన్.. వైఎస్ హయం నుండే దళితులూ ఆయనకు దగ్గర అయ్యారు.. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ ఓటు బ్యాంకు ను జగన్ కాపాడుకుంటూ వస్తున్నాడు.. కాబట్టి వైసీపీకి దళితులను దూరం చేయటం అంత ఈజీ వ్యవహారం కాదు.

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది