Nara Lokesh : పవన్ అన్న ముందు ఎవడైనా ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తా.. టీడీపీ నేతలకు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రధానాంశాలు:
2024 లో టీడీపీ, జనసేన రెండూ అత్యధిక మెజార్టీతో గెలుస్తాయి
రెండు పార్టీలు కలిసే కార్యాచరణ ప్రకటిస్తాయి
స్పష్టం చేసిన నారా లోకేష్
Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా జనసేన, టీడీపీ నేతల మధ్య జరిగిన వార్ గురించే చర్చ నడుస్తోంది. అసలు టీడీపీ, జనసేన నేతలు కొట్టుకోవడం అంటేనే అది వైసీపీకి చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే దీనిపై అటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ యువనేత నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవుల గురించి ఇప్పుడు కొట్టుకోవడం కాదు.. ఆ పదవులు వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడే మీరు ఎందుకు అంత అవేశపడుతున్నారు అని రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇదే ఇష్యూపై నారా లోకేష్ కూడా స్పందించారు. త్వరలోనే మేనిఫెస్టో రూపొందించబోతున్నాం. అది కూడా జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టో రూపొందించబోతున్నాం. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసే ఏ కార్యచరణ అయినా రూపొందిస్తాం. జేఏసీ మీటింగ్ లో భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తాం.. అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
నారా లోకేష్ మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు. నారా లోకేష్ మాట్లాడుతున్నంత సేపు పవన్.. లోకేష్ నే చూస్తున్నారు. పవన్ గారు చెప్పినట్టు 2024 లో టీడీపీ, జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. 2024 లో డౌటే లేదు. మాకు పదవులు వద్దు. ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం మేము ముందుండి నడుస్తున్నాం అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతాయని.. ఎలాంటి నిర్ణయాలు అయినా రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని.. దీనిపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.
Nara Lokesh : ప్రజల కోసమే మేం కలిశాం
ప్రజల కోసమే మేము కలిశాం. మా పార్టీలు కలిశాయని నారా లోకేష్ అన్నారు. అందుకే.. జనసేన, టీడీపీ రెండు పార్టీల నేతలు అస్సలు కంగారు పడొద్దని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి కోసం రెండు పార్టీల నేతలు కలిసికట్టుగా పని చేయాలని.. అప్పుడే అరాచక పాలన నుంచి ఆంధ్ర ప్రజలకు విముక్తి కలుగుతుందని స్పష్టం చేశారు.