Nara Lokesh : ఢిల్లీ పర్యటనలో బాబు చేసిన ఆ పనికి ఫుల్ సీరియస్ గా ఉన్న లోకేష్..?

Authored By Breaking News | The Telugu News | Published on: August 30, 2023, 2:00 pm

Nara Lokesh : వచ్చే ఎన్నికలలో గెలవడానికి తెలుగుదేశం పార్టీ రకరకాల వ్యూహాలతో వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పాల్పడే సీనియర్లను యువ నేత లోకేష్ పక్కన పెట్టేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ తో పాటు కింజరాపు రామ్మోహన్ నాయుడు లతో ఫోటోలు దిగటం జరిగింది. ఈ వ్యవహారంపై నారా లోకేష్ చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళ్తే గుంటూరు జిల్లాలో ఇంకా కృష్ణాజిల్లాలో లోకేష్ పాదయాత్రలో గల్లా జయదేవ్ తో పాటు కేసినేని నాని ఎవరు కూడా పాల్గొనలేదు. పైగా అర్ధరాత్రి పాదయాత్ర ఏంటి అంటూ గల్లా జయదేవ్ కామెంట్లు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అటువంటి నాయకులతో చంద్రబాబు ఢిల్లీలో చట్టపట్టలేసుకుని తిరగటం లోకేష్ కి అసలు నచ్చలేదంట.

Nara lokesh serious On babu

Nara Lokesh : ఢిల్లీ పర్యటనలో బాబు చేసిన ఆ పనికి ఫుల్ సీరియస్ గా ఉన్న లోకేష్..?

పైగా కేశినేని నాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్న క్రమంలో అంత సన్నిహితంగా చంద్రబాబు మెలగటం పట్ల లోకేష్ తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాదయాత్ర కార్యక్రమాన్ని లైట్ తీసుకున్న నాయకులను చంద్రబాబు దగ్గరకు తీసుకోవటం ఏమాత్రం నచ్చలేదట.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp