Nara lokesh : ఆ పోలీసుల‌కి లోకేష్ రెడ్ బుక్ టెన్ష‌న్ ప‌ట్టుకుందిగా.. అందులో ఏముంది? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nara lokesh : ఆ పోలీసుల‌కి లోకేష్ రెడ్ బుక్ టెన్ష‌న్ ప‌ట్టుకుందిగా.. అందులో ఏముంది?

Nara lokesh : చంద్ర‌బాబు త‌న‌యుడు, .టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎలాగైన ఎన్నిక‌ల‌లో అధికారం త‌మ‌కే ద‌క్కాల‌ని యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేయ‌డం మ‌నం చూశాం. అయితే పాద‌యాత్ర ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి నారా లోకేష్ చేతిలో ఎర్ర‌ని పుస్తకం ఒక‌టి క‌నిపించింది. తమను, తమ పార్టీ క్యాడర్ ను ఇబ్బందిపెట్టిన పోలీసులు, అధికారులు, నేతల పేర్లను ఆ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల పని […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Nara lokesh : ఆ పోలీసుల‌కి లోకేష్ రెడ్ బుక్ టెన్ష‌న్ ప‌ట్టుకుందిగా.. అందులో ఏముంది ?

Nara lokesh : చంద్ర‌బాబు త‌న‌యుడు, .టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎలాగైన ఎన్నిక‌ల‌లో అధికారం త‌మ‌కే ద‌క్కాల‌ని యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేయ‌డం మ‌నం చూశాం. అయితే పాద‌యాత్ర ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి నారా లోకేష్ చేతిలో ఎర్ర‌ని పుస్తకం ఒక‌టి క‌నిపించింది. తమను, తమ పార్టీ క్యాడర్ ను ఇబ్బందిపెట్టిన పోలీసులు, అధికారులు, నేతల పేర్లను ఆ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల పని పడతామంటూ హెచ్చరిక‌లు జారీ చేశారు. అయితే ఈ రెడ్ బుక్ విష‌యంలో నారా లోకేష్‌కి లేని పోని చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.

Nara lokesh రెడ్ బుక్ టెన్ష‌న్..

అధికారుల పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం రాష్ట్ర సీఐడీకి సూచనలు చేసింది. న్యాయస్థానం సూచన మేరకు సీఐడీ అధికారులు లోకేశ్ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్టు వాట్సాప్ లో సీఐడీకి లోకేశ్ బదులిచ్చారు.నారా లోకేష్‌‌పై దాఖలైన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో లోకేష్‌పై అరెస్టు ఉత్తర్వులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ సారి కూట‌మి వైపు గాలి వీస్తుండ‌డంతో ఆ రెడ్ బుక్ లో ఉన్న పోలీసులు, అధికారులకు టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. వైసీపీ అండ చూసుకొని గతంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై రెచ్చిపోయిన కొందరు పోలీసులు, అధికారులు రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ప‌రిస్థితి ఏంటి అని టెన్ష‌న్‌లో ఉన్నార‌ట‌.

Nara lokesh ఆ పోలీసుల‌కి లోకేష్ రెడ్ బుక్ టెన్ష‌న్ ప‌ట్టుకుందిగా అందులో ఏముంది

Nara lokesh : ఆ పోలీసుల‌కి లోకేష్ రెడ్ బుక్ టెన్ష‌న్ ప‌ట్టుకుందిగా.. అందులో ఏముంది?

ఇక, వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో ట‌చ్‌లోకి కొందరు వెళుతున్నారని తెలుస్తోంది. జగన్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ అనుకూల పోలీసులు, అధికారులు కొందరు చంద్రబాబును ప్రసన్నం చేసుకునే ప‌నిలో ఉన్నారని ఇప్పుడు నెట్టింట చర్చ జ‌రుగుతుంది. అయితే కూట‌మి, వైసీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని తెలుస్తుండగా, ఈ సారి ఏది గెలిచిన కూడా ప్ర‌తిప‌క్షం స్ట్రాంగ్‌గానే ఉంటుంద‌ని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే జూన్ 4 వరకు వేచిచూడక తప్పదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది