KCR : బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ఇచ్చింది నాకు.. కేసీఆర్ పై రెచ్చిపోయిన పెద్దాయన
ప్రధానాంశాలు:
మాకు కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది.. కేసీఆర్ ఏం ఇచ్చాడు?
భట్టి వస్తేనే మధిర బాగుపడుతుంది
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ తొక్కేస్తాం
KCR : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో కాంగ్రెస్ పార్టీ అయితే జోరు మీద ఉంది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జోరుమీదున్నారు. తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలే వీస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణలో అసలు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు. అధికార బీఆర్ఎస్ వైపా.. లేక కాంగ్రెస్ వైపా.. ఎవరి వైపు ఉన్నారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ.. కొన్ని యూట్యూబ్ చానెళ్లు అయితే ఇప్పటికే తెలంగాణ ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఓ పెద్దాయన మాత్రం ఓ రేంజ్ లో తెలంగాణ రాజకీయాల మీద ఫైర్ అయ్యాడు. అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అంటే అభిమానం అంటూ ఆ పెద్దాయన చెప్పుకొచ్చాడు.
రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ చేసిన మేలు ఎవ్వరూ చేయలేదు. కేసీఆర్ వచ్చి ఏం చేసిండు. పించను గించను అంటూ ఇస్తున్నాడు కానీ.. 6 నెలల నుంచి పించనే రాలేదు. కేసీఆర్ వల్ల ఏం రాలేదు. ఒక్క ఇల్లు కట్టించాడా చెప్పమను. ఏం లేదు. ఎక్కడైనా కేసీఆర్ వల్ల ఏం జరగలేదు. నీరుడు ఒక వెయ్యి వేసిండు.. ఇప్పుడు ఇంకో వెయ్యి వేసిండు.. అంతే. ఆయన మోదీ రెండు వేలు ఏసిండు. ఆయన, ఈయన ఎవ్వరూ చేసిందేం లేదు. కేసీఆర్ వల్ల అయ్యేదేం లేదు. స్టేజీ మీద అయ్యా కొడుకులు మీసాలు లేకుండా మాటలు చెప్పడం కాదు. ఇవన్నీ వట్టి మాటలే. మధిర మండలంలో ఏం చేయలేదు. మళ్లీ కేసీఆర్ వస్తే అడ్డుకోవడమే జనాలు. కేసీఆర్ వల్ల ఏం కాదు. కాంగ్రెస్ రావాలి.. కేసీఆర్, ఆయన కొడుకు ఇద్దరినీ తొక్కి పడేయడమే అంటూ చెప్పుకొచ్చాడు ఆ పెద్దాయన.
KCR : మాకు ఇచ్చిందన్నీ కాంగ్రెస్సే.. బీఆర్ఎస్ ఇచ్చిందేం లేదు
మాకు ఇల్లు ఇచ్చింది వాళ్లే.. చోటు ఇచ్చింది వాళ్లే. వీళ్లు ఏం ఇచ్చారు. ఏం ఇవ్వలేదు. కేసీఆర్ వల్లనే పెగలదు.. మాకు భట్టీ గారు రావాలి. ఆయనే గెలుస్తాడు. కాంగ్రెస్ ఎక్కడ చూసినా గెలుస్తుంది. కాంగ్రెస్ వస్తేనే అన్ని పథకాలు ఉంటాయి. మళ్లీ కాంగ్రెస్ రావాలి.. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ఆ పెద్దాయన కుండ బద్ధలు కొట్టాడు.