YS Jagan : ఆ పార్టీ నేతలు మళ్లీ ఓట్లు అడిగితే ఈడ్చి తంతాం.. ఆ పార్టీపై ఈ పెద్దావిడ మాటలు వింటే మతిపోతుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఆ పార్టీ నేతలు మళ్లీ ఓట్లు అడిగితే ఈడ్చి తంతాం.. ఆ పార్టీపై ఈ పెద్దావిడ మాటలు వింటే మతిపోతుంది

 Authored By kranthi | The Telugu News | Updated on :31 October 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  మళ్లీ జగన్ నే ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం అంటున్న ఏపీ ప్రజలు

  •  జగన్ కే ఓటేస్తాం.. జగన్ నే గెలిపిస్తాం

  •  చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేశాడు?

YS Jagan : ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఇక ఏపీలో కూడా ఇంకో ఐదారు నెలలు అయితే ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. వచ్చే సంవత్సరం మేలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంతో అసలు ఏపీలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. 2024 ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ నే గెలిపిస్తారా? లేక చంద్రబాబుకు చాన్స్ ఇస్తారా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం జగన్ పాలనపై సర్వత్రా పాజిటివ్ స్పందన వస్తోంది. పింఛన్ దగ్గర్నుంచి అమ్మ ఒడి, ఇతర పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకే, వాళ్ల అకౌంట్లలోనే డబ్బులు పడిపోతున్నాయి. దీంతో జగన్ పాలనపై కొన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి పథకాలు ఏం లేవు. మరి.. ఇప్పుడు ప్రతి ఇంటికి అనేక రకాల పథకాల మూలంగా కొన్ని వేల రూపాయలు ఇస్తున్నారు. ఇంతకంటే ఏం చేయాలి అంటూ కొందరు జగన్ కే ఓటేస్తున్నారు.

జగన్ బాగా చేస్తున్నారు. అమ్మ ఒడి, ఆటో వాళ్లకు డబ్బులు పడుతున్నాయి. డ్వాక్రా మాఫీలు చేస్తున్నారు. మళ్లీ జగన్ కే ఓటేస్తాం అంటున్నారు. అందరికీ డబ్బులు ఇస్తున్నారు. అందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు. ముసలివాళ్లకు, వితంతువులకు అందరికీ ఇంటికి తెచ్చి మరీ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుతున్నారు జగన్. అటువంటి వ్యక్తికి కాకుండా ఇంకెవరికి వేస్తాం ఓట్లు అంటూ వృద్ధులు తెలుపుతున్నారు. వృద్ధులందరికీ జగన్ కొడుకులా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని బాధలు పడి మా ముసలివాళ్లకు డబ్బులు ఇస్తున్నాడు అని ఓ ముసలావిడ చెప్పుకొచ్చారు. ఈసారి జగన్ నే ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది. ఆడవాళ్లకు 10 వేలు ఇస్తున్నారు. చదువుకునే పిల్లలకు రూ.10 వేలు ఇస్తున్నారు. 2 రూపాయల బియ్యం ఇస్తున్నారు. అరువు పెట్టుకొని సామాన్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తుంటే ఎందుకు ఓట్లేయకుండా ఉంటాం. 170 సీట్లు ఈసారి మళ్లీ గ్యారెంటీ అంటూ ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు.

YS Jagan : చంద్రబాబు ఉన్నప్పుడు ఇవన్నీ పథకాలు ఉన్నాయా?

చంద్రబాబు ఉన్నప్పుడు ఈ పథకాలు ఏవీ లేవు అంటూ చెప్పుకొచ్చారు. జగన్ వచ్చాకనే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందని.. అటువంటి వ్యక్తికి కాకుండా వేరే వాళ్లకు ఎందుకు ఓట్లేస్తామని ఏపీ ప్రజలు చెబుతున్నారు. వాలంటీర్లు ఇంటి తలుపు కొట్టి మరీ ఇంటికి వచ్చి మరీ డబ్బులు ఇస్తున్నారని.. అలాంటి వాళ్లకే తమ ఓటు అని చెబుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది