Operation Sindoor IPL : ఆప‌రేష‌న్ సిందూర్.. ఐపీఎల్ జ‌రుగుతుందా, విదేశీ ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఏంటి..?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on : 7 May 2025, 9:00 pm
  •  Operation Sindoor IPL : ఆప‌రేష‌న్ సిందూర్.. ఐపీఎల్ జ‌రుగుతుందా, విదేశీ ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఏంటి..?

Operation Sindoor IPL : పహల్గాంలో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా ఆప‌రేష‌న్ సిందూర్ నిర్వ‌హించింది భార‌త సైన్యం. దీని త‌ర్వాత చాలా మందిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ 2025 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్‌’తో భారత్‌- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Operation Sindoor IPL : ఆప‌రేష‌న్ సిందూర్.. ఐపీఎల్ జ‌రుగుతుందా, విదేశీ ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఏంటి..?

Operation Sindoor IPL : ఆప‌రేష‌న్ సిందూర్.. ఐపీఎల్ జ‌రుగుతుందా, విదేశీ ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఏంటి..?

Operation Sindoor IPL స‌మ‌స్య ఏమి లేదు..

‘ఆపరేషన్ సిందూర్‌’ తర్వాత భారత ప్రభుత్వం దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లపై ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ విమానాశ్రయాలు 10వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అయితే భారత ప్రభుత్వ ఆంక్షలు ఐపీఎల్‌ షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈనెల 8న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.

ఇప్పటికే రెండు జట్లూ కూడా అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణకు ఎలంటి ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత ఇదే స్టేడియంలో మే 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్‌ ధర్మశాల చేరుకోవాలంటే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అదే జరిగితే.. సుదీర్ఘ రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తారా? లేదా అప్పటివరకూ పరిస్థితులు చక్కబడతాయా ? అనేది తేలాల్సి ఉంది. ఐపీఎల్‌కు సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Advertisement

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి