
Operation Sindoor IPL : ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ జరుగుతుందా, విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి..?
Operation Sindoor IPL : పహల్గాంలో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది భారత సైన్యం. దీని తర్వాత చాలా మందిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ 2025 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Operation Sindoor IPL : ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ జరుగుతుందా, విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి..?
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత ప్రభుత్వం దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లపై ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ విమానాశ్రయాలు 10వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అయితే భారత ప్రభుత్వ ఆంక్షలు ఐపీఎల్ షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈనెల 8న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.
ఇప్పటికే రెండు జట్లూ కూడా అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణకు ఎలంటి ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత ఇదే స్టేడియంలో మే 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ధర్మశాల చేరుకోవాలంటే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అదే జరిగితే.. సుదీర్ఘ రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తారా? లేదా అప్పటివరకూ పరిస్థితులు చక్కబడతాయా ? అనేది తేలాల్సి ఉంది. ఐపీఎల్‌కు సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.