Actress : ప్రకంపనలు పుట్టిస్తున్న హోంమంత్రి హీరోయిన్ లీకులు.. బిగ్ గిఫ్ట్‌లు..!
ప్రధానాంశాలు:
Actress : ప్రకంపనలు పుట్టిస్తున్న హోంమంత్రి హీరోయిన్ లీకులు.. బిగ్ గిఫ్ట్‌లు..!
Actress : బంగారం స్మగ్లింగ్ కేసు లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పుడు ఈ కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో సోదాలు చేపట్టారు.

Actress : ప్రకంపనలు పుట్టిస్తున్న హోంమంత్రి హీరోయిన్ లీకులు.. బిగ్ గిఫ్ట్‌లు..!
Actress ప్రకంపనలు..
నటితో హోంమంత్రికి చెందిన విద్యాసంస్థలకు ఆర్థిక లావాదేవీలున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. రన్యా రావుకి, పరమేశ్వర ఛైర్మన్‌గా ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో సదరు వైద్య కళాశాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ పరిణామాల మధ్య డీకే శివకుమార్, పరమేశ్వర నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.
ప్రజా జీవితంలో ఉన్న మేము చాలా కార్యక్రమాలకు వెళ్తుంటాం. పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కానుకలు ఇవ్వడం సహజం. పెళ్లి సమయంలో నటికి గిఫ్ట్ ఇచ్చానని మంత్రి తెలిపారు, ఇందులో తప్పు లేదు” అని శివకుమార్ వ్యాఖ్యానించారు. అయితే, రన్యారావు నేరపూరిత చర్యలను ఏ రాజకీయ నాయకుడూ సమర్థించరని ఆయన స్పష్టం చేశారు. రన్యారావు వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జి.పరమేశ్వర కూడా హాజరైనట్లు తెలియడంతో, హోంమంత్రికి సంబంధించిన కళాశాలపై ఈడీ దాడులు జరగడం రాజకీయంగా మరింత వేడిని రాజేసింది.