Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి? కొడాలి నానికి ఉచ్చ పోయించిన పవన్
Pawan Kalyan : ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అయినా ప్రజలకు సేవ చేయడమే.. దాన్నే పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతాడు. తాజాగా ఆయన పొత్తు విషయంపై, చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. నేను పొత్తు చేయాలనుకుంటే ఓపెన్ గా చెప్పేస్తాను.. అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతూ ఇది అభియోగం అంటూ చెప్పుకొచ్చారు. మన రాష్ట్రంలో అవినీతి పరుడు ఎవరు అంటే 29 కేసులు ఉన్న ముఖ్యమంత్రి జగన్ అంటూ పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు ఏదైనా బీజేపీతో సమస్య ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుతూ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మేము 2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు.. అన్నారు.
సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అది పొలిటికల్ పార్టీ కాదు. వాళ్లంతా నటులు. వాళ్లు పొలిటికల్ హీట్ ను తీసుకోలేరు. వాళ్లకు వంద సమస్యలు ఉంటాయి. వాళ్లకు ఎలాంటి అభిప్రాయాలు లేవా అనడం కరెక్ట్ కాదు కానీ.. వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బయటికి రాకపోవడానికి కారణం వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అందుకే వాళ్లు బయటికి రావడం లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన మీద చాలామంది సినిమాలు తీశారు. కోట శ్రీనివాసరావు గారు తీశారు.. పృథ్వీ గారు కూడా తీశారు. కానీ.. ఆయన పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్లు అంటూ పవన్ మండిపడ్డారు.

#image_title
Pawan Kalyan : రజినీకాంత్ గారిని కూడా తిట్టారు
అదంతా ఎందుకు రజినీకాంత్ గారు.. ఒక సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. అశేష అభిమానం ఉన్న వ్యక్తి. ఆయన చంద్రబాబు గారిని మాట వరుసకు వచ్చి మర్యాద పూర్వకంగా కలిస్తే ఆయన్ను తిట్టని తిట్టు లేదు. వైసీపీ నేతలు రజినీకాంత్ ను కూడా టార్గెట్ చేసి తీవ్రంగా దూషించారు. ఆయనే డిఫెండ్ చేసుకోలేకపోయినప్పుడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు వైసీపీ నేతల నోళ్లలో పడకూడదని అనుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.