Pawan Kalyan : ఎర్రమట్టి దిబ్బలు అరుదైన సంపద మనమే కాపాడుకోవాలి పవన్ కీలక వ్యాఖ్యలు…!!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ప్రస్తుతం నాలుగో దశ సాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలు తూర్పుగోదావరిలో యాత్ర జరిగింది. రెండో విడత.. ఏలూరు జిల్లాలో మూడో విడుతలో పశ్చిమగోదావరి జిల్లాలో.. జరగగా ప్రస్తుతం నాలుగో విడత విశాఖపట్నంలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే విశాఖ వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజాప్రతినిధులపై సీఎం జగన్ పై..
పవన్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. రుషికొండ పై అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని మండిపడటం జరిగింది. ఆగస్టు 16వ తారీకు భీమిలి ఎర్ర మట్టి దిబ్బలను పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎర్ర మట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద. వాటిని రక్షించుకునే అవగాహన మనకు లేదు. దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఈ ఎర్ర మట్టి దిబ్బలు.. ఇప్పుడు 292 ఎకరాలు మాత్రమే మిగిలింది.
ఈ ఎర్ర మట్టి దిబ్బల రక్షణ పై కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తాం. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎర్ర మట్టి దిబ్బలు ఉన్న ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. రక్షణ కంచె కూడా ఏర్పాటు చేయాలి. దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే…ఎర్ర మట్టి దిబ్బల రక్షణ కోసం గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్తాం. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం దోపిడీ ఆగాలి అని పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
