Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఎందుకు సైడ్ అవుతున్నారు.. ఆయన అలా చేసి ఉంటే ఎంత మంచి పేరు వచ్చేది
ప్రధానాంశాలు:
Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఎందుకు సైడ్ అవుతున్నారు.. ఆయన అలా చేసి ఉంటే ఎంత మంచి పేరు వచ్చేది
Pawan kalyan : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోఎంట్రీ ఇచ్చినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం పవన్‌కు వీరాభిమానులు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈయన పదవిలోకి వచ్చాక ప్రజలలోకి వెళ్లి వారికి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని అది చేయలేదు. కాకపోతే తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తన వంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Pawan kalyan పవన్ చెప్పిన కారణం ఇదే..
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి.. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వరద బాధితులను పరామర్శించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. డిప్యూటీ సీఎంకు బాధ్యతలేదా.. ప్రజల్ని పట్టించుకోవడానికి తీరిక లేదా.. బర్త్ డే పార్టీలలో ఇంకా బిజీగా ఉన్నారా.. అంటూ వైఎస్సార్సీపీ వాళ్లు విమర్శించారు.. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ అపోసిషన్ పార్టీలకు గట్టిగానే ఇచ్చిపడేశారు. వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన స్టైల్ లో స్పందిస్తూ… కొందరు కావాలని ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో లేకపోయిన.. అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్ చేస్తున్నానని చెప్పారు. ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు సూచనల మేరకు.. తాను వరద ప్రాంతాల్లో పర్యటించలేదని క్లారిటీ ఇచ్చారు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఎందుకు సైడ్ అవుతున్నారు.. ఆయన అలా చేసి ఉంటే ఎంత మంచి పేరు వచ్చేది
సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే.. నేను వరద ప్రాతాలలో పర్యటించలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం యాక్టివ్ గా పనిచేస్తుందన్నారు. తాను వరద ప్రాంతంలో వెళితే.. అక్కడి అధికారులకు ఇబ్బందులు కల్గవచ్చని అన్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని చేస్తున్న విమర్శలు, ఏదో మాట్లాడాలని తప్ప వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రజలు మూకుమ్మడిగా వస్తారని ఇంకెన్నాళ్లు పవన్ కళ్యాణ్ ఇలా అజ్ఙాతంలో ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.