Pawan Kalyan : నిజంగా జగన్ పవన్ కి ఫోన్ చేసాడా? త్రివిక్రమ్ స్క్రిప్ట్ లా ఉందే !
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్ర ట్రెండ్ అవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను మొదలు పెట్టిన విషయం తెలుసు కదా. ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసలే ఎన్నికల ఏడాదిలోకి ఎంటర్ అవడంతో ఏపీలో రాజకీయాలన్నీ వేడెక్కుతున్నాయి. ముందస్తు వచ్చినా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలి కదా. అందుకే జనసేనాని ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతూ వారాహి యాత్రను చేపట్టారు.
ఇందులో భాగంగా వారాహి యాత్రలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈసందర్భంగా పవన్ కళ్యాణ్.. తన అభిమానులతో పంచుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాలని పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారట. ఆయన ఫోన్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా తాను శుభాకాంక్షలు తెలిపానని.. తాము కూడా చాలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతలుగా వ్యవహరిస్తామని చెప్పామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
YS Jagan – Pawan Kalyan : వ్యక్తిగత విమర్శలు చేయమని నేను మాటిచ్చా
తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత విమర్శలు చేయమని.. పాలసీల పరంగానే ఏదైనా తప్పు జరిగితే మాత్రం గొంతెత్తి మాట్లాడుతాం. కానీ.. మాకు ఆ అవకాశం రావద్దు. అలాంటి పాలన చేయండి. మీకు జనాలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు.. అని నేను జగన్ కు శుభాకాంక్షలు చెప్పాను.. అని 2019 ఎన్నికల తర్వాత జరిగిన విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. కానీ.. తాను ఇప్పుడైతే భవన నిర్మాణ కార్మికుల కోసం రోడ్డెక్కానో.. అప్పటి నుంచి నన్ను తిట్టడం ప్రారంభించారని.. పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభ జరిగిన కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు.