Pawan Kalyan : ఢిల్లీ టూర్ లో ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు..!!
Pawan Kalyan : ఒకప్పుడు ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ ముఖం మాడిపోయినట్టు కనిపించింది. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని ఆ సమయంలో పవన్ ప్రయత్నాలు చేసినట్లు మోడీ.. వద్దని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ రెండు రోజులు పర్యటించడం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ పార్టీకి చెందిన చాలామంది పెద్దలతో భేటీ కావడం జరిగింది. అయితే రెండు రోజుల పర్యటన అనంతరం నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో
పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా కనిపించారు. పవన్ మీడియాతో మాట్లాడుతూ…. చాలా రోజుల నుండి అనుకుంటున్నా సమావేశం ఇది. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గురించి చర్చించుకోవడం జరిగింది. అయితే మొత్తం చర్చల సారాంశం వైసీపీ విముక్తా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమని ఇదే బిజెపి జనసేన ఎజెండా అని పవన్ స్పష్టం చేశారు. అధికారం ఏ విధంగా సాధించాలి అన్నదానిపై రెండు రోజులు జరిపిన చర్చల ఫలితాలు రాబోయే రోజుల్లో బలమైన సత్ఫలితాలను తీసుకొస్తుందని భావిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఇంకా ఇదే సమయంలో పొత్తుల
విషయంలో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నట్టు పవన్ వ్యాఖ్యానించారు. సో మొత్తం గమనిస్తే మోడీ విశాఖపట్నం వచ్చిన సమయంలో పెట్టిన మీడియా సమావేశం… ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిసిన తర్వాత మీడియా పెట్టిన సమావేశంలో… పవన్ ముఖ కవళికలో చాలా తేడా కనబడింది. విశాఖపట్నంలో చాలా డల్ గా కనిపిస్తే ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో బిజెపి కలిసే అవకాశాలు ఉన్నట్లు ప్రజెంట్ బయట ప్రచారం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.