Pawan kalyan : టీడీపీ పొత్తు పై ఎవరైనా నోరు జారితే తోలు తీస్తా.. ఇన్ డైరెక్ట్‌గా నారా లోకేష్ కౌంటర్ : పవన్ కళ్యాణ్..!!
ప్రధానాంశాలు:
Pawan kalyan : టీడీపీ పొత్తు పై ఎవరైనా నోరు జారితే తోలు తీస్తా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..!!
Pawan kalyan : ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సన్నద్ధంగా ఉన్నాయి. ఇక అధికార పార్టీ వైయస్సార్ సీపీ పార్టీని ఎదుర్కోవడానికి జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇక బీజేపీ కూడా వారితో కలిస్తే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇక మొదటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో విమర్శలు పాలవుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పై చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి టీడీపీ పొత్తుపై నోరు జారుతున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
ఒక వ్యక్తి నలిగిపోయి, ఛిద్రమైతే తప్ప వెలుగులోకి రాడు. వాడికి రాజకీయం వద్దు అని అనిపించేలా చేస్తారు. అంత టార్చర్ పెడితే తప్ప వాడు పార్టీని నడపలేడు. కోట్లాదిమందికి సంబంధించిన భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడానికి నాయకుడు నలగకపోతే వాడి పార్టీని చంపేస్తారు. జగన్ అనేవాడు ఒక మహానుభావుడు, మహాత్ముడు అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే వాడిపై గెలవాలంటే ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్పేముంది. ఒకరు ఎంత నోరు జారిన నేను నోరు జారను. అది నా మీద నాకున్న గౌరవంష మాటమీద నిలబడతాను. ఈస్ట్ గోదావరి నుంచి పార్టీ నాయకులు వైసీపీలోకి వెళ్లారు. వాళ్లు మనల్ని తిట్టడానికి రెడీగా ఉంటారు. అయినా నాకేం ఇబ్బంది లేదు. జనసేన, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు అని పవన్ తీవ్ర విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను ఎన్ని మాటలు పడటానికైనా సిద్ధంగా ఉన్నాను. టిడిపి తో జనసేన వెనక నడవటం లేదు. పక్కన నడుస్తుంది, కలిసి నడుస్తుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకుడు చేసే వేషాల వలన విమర్శలు చేస్తున్నాను తప్ప ఆ పార్టీపై నాకు ఎటువంటి బిన్నాభిప్రాయాలు లేవు. జనసేన బలం ఏంటో నాకు తెలుసు. జనసేన బలం లేని చోట బలపరుచుకోవాలి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకున్నా. అంతేకానీ అధికారం కోసం జనసేన చూడదు. ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాత్రమే జనసేన ముందడుగు వేస్తుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన జనసేన బలహీన పడదు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
