Chiranjeevi VS Roja : జగనన్నకు చెప్పేంత మగాడివా చిరంజీవి.. ఒసేయ్ రోజా ఒళ్లు మదమెక్కిందా తన్ని తగలేస్తా.. పవన్ సీరియస్

Advertisement

Chiranjeevi VS Roja : ప్రస్తుతం ఏపీలో ఏ విషయం ట్రెండింగ్ అవుతుందో తెలుసు కదా. మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వంపై ఆయన వాల్తేరు వీరయ్య 200వ రోజు ఈవెంట్ లో చిర్రెత్తుకొచ్చారు. ప్రత్యేక హోదా గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి. కానీ.. ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అంటూ మెగాస్టార్ ఆవేశపడుతూ మాట్లాడిన దానిపై వైసీపీ నేతలు కూడా మెగాస్టర్ పై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు.

Advertisement

pawan kalyan serious on roja over her comments against chiranjeevi

Advertisement

ఇప్పటికే కొడాలి నాని, పేర్ని నాని.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు. పకోడీ గాళ్లు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అంటూ కొడాలి నాని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. పేర్ని నాని కూడా గిల్లితే మేము కూడా గిల్లుతాం కానీ.. గిల్లించుకోం అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక.. తాజాగా మంత్రి రోజా కూడా స్పందించారు. మీరు రాజకీయాలను సినిమా వేదికల మీద మాట్లాడటం సరికాదు అంటూ రోజా హితువు పలికారు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కదా రాష్ట్రం విడిపోయింది. అప్పుడెందుకు ప్రత్యేక హోదాపై పోరాడలేదు అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు.

Chiranjeevi VS Roja : రోజాకు కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

చిరంజీవిపై రోజా చేసిన విమర్శలను తిప్పికొట్టారు పవన్ కళ్యాణ్. మీ ఇష్టం ఉన్నట్టుగా పాలించుకుంటాం అంటే మేము ఊరుకుంటామా? మేము బానిసలం కాదు. మీరు. చొక్కా పట్టుకొని అడుగుతాం. ఒక్క మాట మాట్లాడితే గయ్యున లేస్తారు. నేను వీటికి భయపడను. నేను చూడటానికి చాలా పలచగా ఉంటానేమో కానీ.. నా చర్మం కూడా మందంగానే ఉంటుంది. దోపిడీలు చేసే వాళ్లే ఇలా ఉంటే.. రాజ్యాంగ విలువలను, స్వాతంత్ర్య కాల స్ఫూర్తిని మనసులో నింపుకున్న వాళ్లకు ఇంకెంత ధైర్యం ఉంటుంది. వాళ్లు అన్నంత మాత్రాన మన ఒళ్లు ఏం చిల్లు పడిపోదు. ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రా నుంచి ఈ వైసీపీ పార్టీని తన్ని తరిమేసే వరకు జనసేన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తున్నాం అంటూ ఆవేశంతో ఊగిపోయారు పవన్ కళ్యాణ్.

Advertisement
Advertisement