Pawan Kalyan : కొత్త బిల్లు ప్రవేశపెట్టాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపు.. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపే ఆలోచన
Pawan Kalyan : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరంగంలో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వలన సెలబ్రిటీలు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారు.రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.. సోషల్ మీడియా. రాజకీయ వాతావరణం మొత్తం కొద్ది రోజులుగా దీని చుట్టే తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, వాళ్లకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. సోషల్ […]
ప్రధానాంశాలు:
Pawan Kalyan : కొత్త బిల్లు ప్రవేశపెట్టాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపు..సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపే ఆలోచన
Pawan Kalyan : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరంగంలో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వలన సెలబ్రిటీలు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారు.రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.. సోషల్ మీడియా. రాజకీయ వాతావరణం మొత్తం కొద్ది రోజులుగా దీని చుట్టే తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, వాళ్లకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. సోషల్ మీడియా వెళ్తున్న అపసవ్య ధోరణిని సరిచేయడం ఈ సభ నుంచే ప్రారంభం కావాలని, సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan జగన్‌పై పవన్ విమర్శలు..
మార్పు తెస్తామని ప్రజలు మనపై అపార నమ్మకం ఉంచారని, దాన్ని మనం నిలబెట్టుకోవాలన్నారు. గత ఐదేళ్లపాటూ చట్టసభలు హుందాతనం కోల్పోవడం వల్లనే సోషల్ మీడియాలో సైకో మూకలు బరితెగించాయన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామరాజుకి శుభాకాంక్షలు తెలిపారు.హోమ్ మంత్రిని సైతం వదలట్లేదని, మహిళ అని కూడా చూడకుండా ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తోన్నారని, శాడిస్టులుగా వ్యవహరిస్తోన్నారని పవన్ విమర్శించారు.సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా దుర్వినియోగమౌతోందని, ప్రమాదకర స్థాయికి చేరుకుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రజలను భయపెట్టడానికి వాటిని ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో ఎంపీగా పనిచేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పట్ల వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఎంపీగా పనిచేసిన రఘురామ కృష్ణంరాజు వంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పవన్ అన్నారు. ఈ సైబర్ బెదిరింపు ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరమని, దీన్ని అడ్డుకోవడానికి సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తమకు భయాన్ని కలిగించిందన్నారు. అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న సంకల్పంతో ముందుడుగేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు తోటిసభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. కర్మ ఎవరినీ వదలదని, రఘురామను తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వని వారు ఇప్పుడు కనీసం సభకు రాలేకపోతున్నారంటూ జగన్‌ను పవన్ విమర్శించారు