Pawan kalyan : రాజోలు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్… జగన్మోహన్ రెడ్డి పై స్ట్రాంగ్ కౌంటర్…!
Pawan kalyan : అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాజోలు ప్రాంతంలో వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బొండం ఎంత తియ్యగా ఉంటుందో నాకు అంత తీయగా వినిపిస్తుందని తెలియజేశారు.2019లో ఎన్నికల్లో నాకు లభించిన ఒకే ఒక్క విజయం ఒక్క రాజోలు విజయం. మబ్బులు కమ్మిన చోట అసలు వెలుతురు లేని చోట రాజోలు విజయం అనేది నాకు ఒక చిన్న వెలుగు రేఖ. మా ఆడపడుచులు , మబ్బుల్లో పిడుగుల్లా పరిగెత్తే నేటి యువత, ఎంతోమంది పెద్దలు మాకు అండగా నిలబడడం వలన ఈరోజు రాజకీయాలలో జనసేన పార్టీ వెన్నెముకగా మారింది. అలాంటి విజయం అందించినవారు రాజోలు ప్రజలు. వారాహి వేదిక మీద నాతోపాటు ఉన్న ఎం హరీష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా జనవాని కార్యక్రమానికి సంఘాన కార్యకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకు వెళ్లినటువంటి శ్రీ వరప్రసాద్ గారు గాజు గ్లాస్ గుర్తుతో మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ పద్మరాజు గారికి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. అదేవిధంగా కూటమిలో భాగంగా పార్టీకి అన్ని రకాలుగా సహాయపడుతున్నటువంటి కార్యకర్తలకు సైతం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.
Pawan kalyan : మొదట పార్టీని నిలబెట్టుకోలేకపోయా…
ఇక ఎన్నికలకు కేవలం 18 రోజులు మాత్రమే మిగిలి ఉంది. గత ఐదు సంవత్సరాల నుండి ఎంతగానో శ్రమిస్తూ వస్తున్నాం. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాగా వారి తాతల దగ్గర నుండి వారి తండ్రుల దగ్గర నుండి రాజకీయాలు చేస్తూ రాలేదు.150 సంవత్సరాలు కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి వచ్చిన వాడిని కూడా కాదు. స్వయంకృషితో జీవితం గడిపే చిన్నపాటి ఉద్యోగి కొడుకును నేను. మీ అందరి అభిమానంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి 2009లో రాజకీయ ప్రస్థానంలో అడుగు పెట్టాను. ఆ సమయంలో పార్టీ ని నిలబెట్టుకోలేకపోయ. చాలామంది రాజకీయాలు మనవల్ల కాదని చెప్పిన నేను వెనుకడుగు వేయలేదు. పంతంగా తీసుకొని దశాబ్ద కాలం నుండి పోరాడుతూ వచ్చాను. ఇన్ని రోజులుగా మీరు ఇచ్చిన బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది.ఇక జగన్ వెళ్ళిపోయే సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాకుళం , ఉభయగోదావరి జిల్లాలలో ఎక్కడికి వెళ్లినా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మారిపోతుందని అంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సారి వైసీపీ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని దీంట్లో ఎలాంటి సందేహం లేదని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
Pawan kalyan : రాజోలుకు ఏం చేయగలం …
రాజోలు కోనసీమ ప్రాంతం. కొబ్బరి చెట్టును పెద్దకొడుకుగా భావించే నేల ఇది. వరప్రసాద్ గారు చెబుతున్నారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి కూడా కోనసీమ జిల్లాల పైన అందరి దృష్టి ఉందని. తెలంగాణ నాయకులు కూడా అంటున్న మాట ఒకటే. మీకు పచ్చని కోనసీమ జిల్లాలు ఉన్నాయి. గోదావరి పరివాహ ప్రాంతాలు ఉన్నాయి. ఒకవైపు గోదావరి పారుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం త్రాగడానికి నీళ్లు దొరకడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత రాజోలు ప్రజలు చాలా నష్టపోయారని ఈసారి కూటమి అధికారంలోకి వస్తే రాజోలు ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అలాగే కోనసీమ జిల్లాలను అభివృద్ధి సంక్షేమం దిశగా తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. కావున వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరారు.