Pawan Kalyan : తిరుమల లడ్డూ వివాదం ప్రకాష్ రాజ్ కి పవన్ వార్నింగ్.. కార్తికి చురకలు..!
Pawan Kalyan : ప్రస్తుతం దేశం అంతా హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ తిరుమల లడ్డూ వివాదం. సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డూలు తయారు చేసే నెయ్యిని జంతువుల కొవ్వు నుంచి తీసుకున్నారని అందుకే నాణ్యత తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి దానిపై దేశమంతటా చర్చ మొదలైంది. దీనిపై డిప్యూటీ సీమె పవన్ కళ్యాణ్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అందుకే పవన్ విచారతో జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 11 రోజుల పాట దీక్ష […]
ప్రధానాంశాలు:
Pawan Kalyan : తిరుమల లడ్డూ వివాదం ప్రకాష్ రాజ్ కి పవన్ వార్నింగ్.. కార్తికి చురకలు..!
Pawan Kalyan : ప్రస్తుతం దేశం అంతా హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ తిరుమల లడ్డూ వివాదం. సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డూలు తయారు చేసే నెయ్యిని జంతువుల కొవ్వు నుంచి తీసుకున్నారని అందుకే నాణ్యత తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి దానిపై దేశమంతటా చర్చ మొదలైంది. దీనిపై డిప్యూటీ సీమె పవన్ కళ్యాణ్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అందుకే పవన్ విచారతో జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 11 రోజుల పాట దీక్ష చేపట్టారు. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఐతే తిరుమల లడ్డూ ఇష్యూపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేరం చేసిన వారికి విచారణ జరిపి శిక్ష వేయండి. కానీ ఈ ఇష్యూని నేషనల్ లెవెల్ లో ఎందుకు రచ్చ చేస్తున్నాని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇండియాలో ఇప్పటివరకు ఉన్న మత గొడవలు చాలవా అని అన్నారు.
దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ తిరుపతి లడ్డూ అపవిత్రం గురించి మాట్లాడుతుంటే ఇందులో ప్రకాష్ రాజ్ కి అసలు సంబంధం ఏంటని అన్నారు. వేరే మతాన్ని నేనేమైనా నిందించానా.. తప్పు జరిగినప్పుడు స్పందించకపోతే ఎలా పోరాడకపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది అది మీకు కూడా తెలుసు. మతాల ఐక్యత పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అని అన్నారు. ఒక హిందువుగా మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని అన్నారు.
హీరో కార్తీ కూడా రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో లడ్డూ కావాలా నాయనా అనే మీం చూసి ఇప్పుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ నాకు ఏ లడ్డు వద్దని అన్నారు. ఐతే దానిపై కూడా పవన్ స్పందించాడు. లడ్డు సున్నితమైన అంశం కాదు. అది మా సెంటిమెంట్.. మాట్లాడే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించి మాట్లాడండి అని అన్నారు. పవన్ కళ్యాన్ కార్తికి కి కూడా కౌంటర్ వేశారు.ఐతే పవన్ కామెంట్స్ పై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను చేసిన ట్వీట్ ఒకటైతే పవన్ దాన్ని వేరేలా చెప్పారని. దయచేసి మరోసారి పవన్ నా ట్వీట్ చూసి మాట్లాడాలని అన్నారు. తాను షూటింగ్ లో ఉన్నాను ఈ నెల 30న వచ్చి క్లారిటీ ఇస్తానని అన్నారు.