PM Kisan : పీఎం కిసాన్ అర్హులు వీరే.. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారో లేరో చెక్ చేసుకోండి
PM Kisan : దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 20వ విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ నిధులు జూన్ 30న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాలతో ఆలస్యమైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జూలై 18న ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటన నేపథ్యంలో ముందే నిధులు జారీ అయ్యే అవకాశముందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
PM Kisan : పీఎం కిసాన్ అర్హులు వీరే.. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారో లేరో చెక్ చేసుకోండి
ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది మూడు విడతలుగా – ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున DBT (Direct Benefit Transfer) ద్వారా జమ అవుతుంది. ఈ పథకాన్ని పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరి కాగా, వారి భూమి రెండు ఎకరాలకు మించకుండా ఉండాలి. అలాగే భూమి వివరాలు ఆన్లైన్‌లో నమోదు అయి ఉండాలి. బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఈ అన్ని వివరాలు సరిగ్గా ఉండాలి వారే ఈ పథకానికి అర్హులవుతారు.
ఈ పథకానికి సంబంధించి మీ పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి. అక్కడ “Beneficiary Status” అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేయొచ్చు. అలాగే “Beneficiary List” విభాగంలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. పేరు లిస్టులో ఉంటేనే రూ.2,000 నిధులు ఖాతాలో జమవుతాయి. ఏవైనా సమస్యలు ఉన్నా, సంబంధిత గ్రామ వాలంటీర్ లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించడం ఉత్తమం. e-KYC పూర్తి చేయడం మరవవద్దు – ఇది తప్పనిసరి ప్రక్రియ.
Parameshwar Reddy : ఈరోజు గురుపౌర్ణమి guru purnima సందర్భంగా సీనియర్ Congress కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ…
Mohan Babu : టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా ఎన్నో మైలురాయిలను చేరుకున్న కలెక్షన్ కింగ్ మోహన్…
Husband Wife : దంపతులు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ప్రేమ, బాధ్యత కలగలిపిన బంధంగా ఉండాలి. కానీ విశాఖపట్నం…
Shubman Gill : india vs England లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న Test Match మూడో…
Nirmala Sitharaman : సోషల్ మీడియాలో Social Media ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఒక…
Vemireddy Prashanti Reddy : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి Vemireddy Prashanti Reddy మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
Samantha : తొలుత మోడల్‌గా వచ్చిన శోభిత ధూళిపాళ్ల sobhita dhulipala ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘రామన్…
Father : ఏ తండ్రైన తన పిల్లల కోసం కాయ కష్టం చేసి, ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా కాపాడతాడు. అయితే…
This website uses cookies.