Home » News » Pm Modi Gifts Shoes To Fan Who Waited 14 Years
News

PM Modi : 14 ఏళ్లుగా చెప్పులు వేసుకొని వ్య‌క్తి.. స్వ‌యంగా బూట్లు తొడిగిన మోది.. వీడియో

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 15, 2025, 4:00 pm
Advertisement

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి దేశ విదేశాల‌లో కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆయ‌న‌ని కలవాలని, మాట్లాడాలని, తాకాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఆయ‌న కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తుంటారు. హర్యానాలోని కైథల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ 14 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యే వరకు బూట్లు ధరించనని ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

PM Modi : 14 ఏళ్లుగా చెప్పులు వేసుకొని వ్య‌క్తి.. స్వ‌యంగా బూట్లు తొడిగిన మోది

PM Modi మంచి మ‌న‌సుతో..

నరేంద్ర మోదీ 2014 లో ప్రధానమంత్రి అయ్యారు. రాంపాల్ కశ్యప్ కోరిక నెరవేరినప్పటికీ, ఆయన మోదీని కలవలేకపోయారు. అందుకే, మోదీని కలిసిన తర్వాతే చెప్పులు వేసుకోవాలని ఇప్పటి వరకు వేచి ఉన్నారు. ఏప్రిల్ 14 హర్యానాకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ విషయం తెలియగానే, ఆయన స్వయంగా రాంపాల్ కశ్యప్ కు ఫోన్ చేసి, ఆయనను కలవమని చెప్పి, ఆయనే స్వయంగా బూట్లు ఇచ్చి, ధరించాలని కోరారు.

Advertisement

స్వయంగా ఆయనే షూ బహుమతిగా ఇచ్చి ఆయన కాళ్లకు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తనను కలవడానికి చెప్పులు లేకుండా వచ్చిన అభిమాని రాంపాల్ కశ్యప్ తో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, “మీరు ఇలా ఎందుకు చేశారు? ఎందుకు ఇబ్బంది పెట్టారు?” అని అడిగారు. అయితే మోదీనే స్వయంగా బూట్లు బహుమతిగా ఇవ్వడం, తన కాళ్లకు తొడగడంతో రాంపాల్ భావోద్వేగానికి గురయ్యారు. వీడియో చూసిన వారు ప్రధాని శత్రువులు అయిన‌ ఆయన ప్రేమకు దాసులు కావాల్సిందేనంటూ వివరిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి