PM Modi : 14 ఏళ్లుగా చెప్పులు వేసుకొని వ్యక్తి.. స్వయంగా బూట్లు తొడిగిన మోది.. వీడియో
ప్రధానాంశాలు:
PM Modi : 14 ఏళ్లుగా చెప్పులు వేసుకొని వ్యక్తి.. స్వయంగా బూట్లు తొడిగిన మోది
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి దేశ విదేశాలలో కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆయనని కలవాలని, మాట్లాడాలని, తాకాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఆయన కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తుంటారు. హర్యానాలోని కైథల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ 14 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యే వరకు బూట్లు ధరించనని ప్రతిజ్ఞ చేశారు.

PM Modi : 14 ఏళ్లుగా చెప్పులు వేసుకొని వ్యక్తి.. స్వయంగా బూట్లు తొడిగిన మోది
PM Modi మంచి మనసుతో..
నరేంద్ర మోదీ 2014 లో ప్రధానమంత్రి అయ్యారు. రాంపాల్ కశ్యప్ కోరిక నెరవేరినప్పటికీ, ఆయన మోదీని కలవలేకపోయారు. అందుకే, మోదీని కలిసిన తర్వాతే చెప్పులు వేసుకోవాలని ఇప్పటి వరకు వేచి ఉన్నారు. ఏప్రిల్ 14 హర్యానాకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ విషయం తెలియగానే, ఆయన స్వయంగా రాంపాల్ కశ్యప్ కు ఫోన్ చేసి, ఆయనను కలవమని చెప్పి, ఆయనే స్వయంగా బూట్లు ఇచ్చి, ధరించాలని కోరారు.
స్వయంగా ఆయనే షూ బహుమతిగా ఇచ్చి ఆయన కాళ్లకు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తనను కలవడానికి చెప్పులు లేకుండా వచ్చిన అభిమాని రాంపాల్ కశ్యప్ తో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, “మీరు ఇలా ఎందుకు చేశారు? ఎందుకు ఇబ్బంది పెట్టారు?” అని అడిగారు. అయితే మోదీనే స్వయంగా బూట్లు బహుమతిగా ఇవ్వడం, తన కాళ్లకు తొడగడంతో రాంపాల్ భావోద్వేగానికి గురయ్యారు. వీడియో చూసిన వారు ప్రధాని శత్రువులు అయిన ఆయన ప్రేమకు దాసులు కావాల్సిందేనంటూ వివరిస్తున్నారు.
మోదీ ప్రధాని అయ్యేవరకు బూట్లు ధరించనని ప్రతిజ్ఞ.. ఎట్టకేలకు 14 ఏళ్ల తర్వాత..!
మోదీ ప్రధాని అయ్యేవరకు బూట్లు ధరించనని 14 ఏళ్ల క్రితం హర్యానాలోని కైథల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ ప్రతిజ్ఞ.
2014లో ప్రధాని పీఠం ఎక్కి తన కోరిక నెరవేరినప్పటికీ.. మోదీని కలవలేకపోయిన రాంపాల్ కశ్యప్.… pic.twitter.com/FdJf1dAQQ2— ChotaNews App (@ChotaNewsApp) April 15, 2025