
Woman : ఇద్దరు సోదరులని పెళ్లి చేసుకున్న ఒక మహిళ.. గ్రాండ్‌గా వివాహం..!
Woman : హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి , కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు, సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ సంప్రదాయాన్ని “జోడిదరన్” లేదా “ద్రౌపది ప్రథ” అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో ఒక మహిళను ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరుల్ని వివాహం చేసుకోవచ్చు. ఈ వివాహం జూలై 12-14 మధ్యలో మూడు రోజుల పాటు జరిగింది.
Woman : ఇద్దరు సోదరులని పెళ్లి చేసుకున్న ఒక మహిళ.. గ్రాండ్‌గా వివాహం..!
ఈ వివాహం పూర్తి సమ్మతితో జరగిందని సునీతా చౌహాన్ తన నిర్ణయం స్వచ్ఛందంగా తీసుకున్నానని చెప్పారు. వారు ఉన్నత విద్యావంతులు. ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో ఉద్యోగి, కపిల్ నేగి విదేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో పనిచేస్తున్నాడు. వారు భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఈ వివాహం ద్వారా కుటుంబ ఐక్యత, సంప్రదాయాన్ని కాపాడుకున్నామని చెబుతున్నారు.
ఈ సంప్రదాయం మహాభారతంలోని ద్రౌపది పాత్రతో సంబంధం కలిగి ఉందని, ఆమె ఐదుగురు పాండవులను వివాహం చేసుకున్నట్లు చెబుతారు సంప్రదాయం ట్రాన్స్-గిరి ప్రాంతంలో, ముఖ్యంగా సిర్మౌర్, కిన్నౌర్, కుల్లూ, లాహౌల్-స్పితి ప్రాంతాలలో సాధారణం. షిల్లై గ్రామంలో దాదాపు 36 కుటుంబాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నాయి. అయితే ఆధునికీకరణ, విద్య, ఉద్యోగ అవకాశాలు, చట్టపరమైన నిబంధనల కారణంగా బహుభర్తృత్వం తగ్గుముఖం పడుతోంది. భారతదేశంలో బహుభర్తృత్వం చట్టవిరుద్ధం అయినప్పటికీ, ఈ ప్రాంతంలో సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.