Ponguleti : కాంగ్రెస్‌లో పొంగులేటి లొల్లి.. ఆ 13 స్థానాల్లో తాను చెప్పిన పేర్లనే ప్రకటించాలని హైకమాండ్‌కి ఒత్తిడి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ponguleti : కాంగ్రెస్‌లో పొంగులేటి లొల్లి.. ఆ 13 స్థానాల్లో తాను చెప్పిన పేర్లనే ప్రకటించాలని హైకమాండ్‌కి ఒత్తిడి?

Ponguleti : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పటి వరకు ఆయన తిరగని పార్టీ లేదు. చివరకు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి చాలా ఆలోచనలు చేశారు. తనకు అడిగిన చోటనే టికెట్ ఇవ్వాలని, అలాగే తన అనుచరులకు, తను చెప్పిన వాళ్లకు కూడా టికెట్లు ఇవ్వాలని ముందే హైకమాండ్ తో మాట్లాడుకున్నారు. అన్నీ ఓకే అని చెప్పాకనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే.. ఇదంతా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :30 September 2023,1:00 pm

Ponguleti : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పటి వరకు ఆయన తిరగని పార్టీ లేదు. చివరకు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి చాలా ఆలోచనలు చేశారు. తనకు అడిగిన చోటనే టికెట్ ఇవ్వాలని, అలాగే తన అనుచరులకు, తను చెప్పిన వాళ్లకు కూడా టికెట్లు ఇవ్వాలని ముందే హైకమాండ్ తో మాట్లాడుకున్నారు. అన్నీ ఓకే అని చెప్పాకనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే.. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి లొల్లి నడుస్తోందట. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలలే సమయం ఉంది. ఆయన్ను తెలంగాణ ప్రచార కమిటీ కో కన్వినర్ గా నియమించారు. ఆ తర్వాత ఇక ఆయన పార్టీలో మరింత యాక్టివ్ అయ్యారు.

ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన తనకు నచ్చిన 13 స్థానాల విషయంలో గెలుపు తనకే వదిలేయాలని హైకమాండ్ కు, నేతలకు చెబుతున్నారు. 13 స్థానాల్లో మాత్రం తనకు నచ్చిన అభ్యర్థులను బరిలో దింపాలని, వాళ్ల గెలుపు బాధ్యతను తనకే వదిలేయాలని పొంగులేటి హైకమాండ్ కు నిర్దేశించడంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్లను ఆశిస్తున్న నేతలకు చుక్కెదురవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు కానీ.. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తుది లిస్టు కూడా రెడీ అయినట్టు సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేసారి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఈనేపథ్యంలో పొంగులేటి ఒక 13 నియోజకవర్గాల్లో మాత్రం తాను చెప్పిన వాళ్లకే టికెట్స్ ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది.

ponguleti srinivas reddy insists congress high command

#image_title

Ponguleti : ఆ 13 స్థానాల్లో పొంగులేటి చెప్పిన వారికే టికెట్స్ ఇవ్వబోతున్నారా?

ఆ 13 స్థానాల్లో తాను చెప్పిన వాళ్లకు టికెట్స్ ఇస్తే ఆ 13 సీట్లు గెలిపించే బాధ్యత తనదే అని పొంగులేటి స్పష్టం చేశారట. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 6 నియోజకవర్గాలు ఉన్నాయి. మిగితా నియోజకవర్గాల్లో మరో 7 సీట్లు ఉన్నాయి. ఇక.. తాను పోటీ చేసేందుకు ఖమ్మం లేదా కొత్తగూడెం, లేదా పాలేరు.. ఈ మూడు నియోజకవర్గాల్లో తనకు ఒక సీటు కేటాయించాలని పొంగులేటి హైకమాండ్ ను కోరారట. అలాగే.. తాను చెబుతున్న 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును కూడా హైకమాండ్ కు పంపించారట.

ఆయన ప్రతిపాదించిన వాళ్లు ఎవరంటే.. సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, ఖమ్మం లేదా కొత్తగూడెం లేదా పాలేరు నుంచి పొంగులేటి, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణ, వైరా నుంచి విజయా భాయ్, సత్తుపల్లి నుంచి కొండూరు సుధాకర్, మహబూబాబాద్ నుంచి మురళీ నాయక్, డోర్నకల్ నుంచి రాంచందర్ నాయక్, శేరిలింగంపల్లి నుంచి రఘునాథ్ యాదవ్, చెన్నూరు నుంచి డాక్టర్ రాజా రమేశ్, పాలకుర్తి నుంచి ఝాన్సీ రెడ్డి, కంటోన్మెంట్ నుంచి పిడమర్తి రవి, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు.. ఈ పేర్లను పొంగులేటి అధిష్ఠానానికి పంపించినట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది