Prashant Kishore – Revanth Reddy : రేవంత్ రెడ్డి ఎగిరి గంతేసే శుభవార్త చెప్పిన ప్రశాంత్ కిశోర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prashant Kishore – Revanth Reddy : రేవంత్ రెడ్డి ఎగిరి గంతేసే శుభవార్త చెప్పిన ప్రశాంత్ కిశోర్

Prashant Kishore – Revanth Reddy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి. ఈసారి బీజేపీ పార్టీ రేసులో ఉన్నా ఆ పార్టీది మళ్లీ మూడో స్థానమే. ఇప్పుడు మొదటి ప్లేస్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే.. ఈసారి నువ్వా నేనా అనే విధంగా ఫైట్ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్.. తమకు తామే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  కేసీఆర్ తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్

  •  కాంగ్రెస్ గెలుపును ప్రకటించిన పీకే

  •  బీఆర్ఎస్ కు పనిచేయనని తేల్చి చెప్పిన పీకే

Prashant Kishore – Revanth Reddy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి. ఈసారి బీజేపీ పార్టీ రేసులో ఉన్నా ఆ పార్టీది మళ్లీ మూడో స్థానమే. ఇప్పుడు మొదటి ప్లేస్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే.. ఈసారి నువ్వా నేనా అనే విధంగా ఫైట్ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్.. తమకు తామే మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందంటూ గొప్పలు చెప్పుకుంటున్నాయి. అసలు ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు అనేది పక్కన పెడితే ఈ 5 రోజులు ప్రచారాన్ని మాత్రం ముమ్మరం చేస్తున్నాయి. ఈ 5 రోజులు ఏమాత్రం విరామం లేకుండా ప్రధాన పార్టీలన్నీ తెగ కష్టపడి మరీ ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ఈ సారి ఎలాగైనా గెలుస్తామన్న ఊపులో కాంగ్రెస్ ఉండగా.. ఈసారి ఓటమి తప్పదని బీఆర్ఎస్ ముందే అంచనా వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులు, పలు సర్వేలు చూస్తూ అదే అనిపిస్తోంది.

మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇటీవల సీఎం కేసీఆర్ తో భేటీ అయినప్పుడు బీఆర్ఎస్ పరిస్థితిని కేసీఆర్ కు వివరించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయించి ఆ రిపోర్ట్ ను కేసీఆర్ కు అందించారట. ఈసారి పోటీ టఫ్ గానే ఉందని చెప్పారట. తెలంగాణలో మౌత్ టాక్ చూస్తే కాంగ్రెస్ దే గెలుపు అని తెలుస్తోంది. రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుండటంతో వెంటనే ప్రశాంత్ కిషోర్ ను పిలిపించారు సీఎం కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ ను తన పార్టీ కోసం ఎన్నికల వరకు పనిచేయాలని కేసీఆర్ కోరారట. కానీ.. ప్రశాంత్ కిషోర్ మాత్రం తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని.. కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని కేసీఆర్ కు వివరించారట. కనీసం వారం రోజులు అయినా వ్యూహకర్తగా వ్యవహరించాలని అడిగినా కూడా పీకే తన నిస్సహాయతను వ్యక్త పరిచారట.

Prashant Kishore – Revanth Reddy : పీకే చెప్పినట్టే కాంగ్రెస్ గెలువబోతోందా?

క్షేత్రస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అసలు పార్టీ మీదనే తీవ్ర స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈసమయంలో సభల్లో మేనిఫెస్టో గురించి కూడా చెప్పకపోవడమే మంచిదని కేసీఆర్ కు పీకే సూచించారట. అందుకే కేసీఆర్ తన సభల్లో కాంగ్రెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కానీ.. బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి మాట్లాడటం లేదు. కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంట్ రాదు.. నీళ్లు రావు.. అవి రావు.. ఇవి రావు అంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. పీకే.. కేసీఆర్ తో భేటీ అయి.. కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంతో అటు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది