Prashanth Kishore : రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కంగ్రాట్స్ సీఎం అని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prashanth Kishore : రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కంగ్రాట్స్ సీఎం అని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్టేనా?

Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ అనగానే మనకు గుర్తొచ్చేది వైసీపీ పార్టీ. ఏపీలో వైసీపీ పార్టీ 2019 లో గెలవడంలో పీకే టీమ్ ముఖ్య పాత్ర పోషించింది. అలాగే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంలోనూ పీకే పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.2014 నుంచి పీకే అంటేనే దేశంలో ట్రెండ్ అయిపోయాడు. ఆయన తెలంగాణలో కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా పని చేశారు. తెలంగాణలో ఎన్నికలకు […]

 Authored By anusha | The Telugu News | Updated on :2 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ గెలుస్తుందని ముందే తెలిసిందా?

  •  పీకే టీమ్ సర్వేలో ఏం తేలింది?

  •  అందుకే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పీకే కంగ్రాట్స్ చెప్పారా?

Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ అనగానే మనకు గుర్తొచ్చేది వైసీపీ పార్టీ. ఏపీలో వైసీపీ పార్టీ 2019 లో గెలవడంలో పీకే టీమ్ ముఖ్య పాత్ర పోషించింది. అలాగే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంలోనూ పీకే పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.2014 నుంచి పీకే అంటేనే దేశంలో ట్రెండ్ అయిపోయాడు. ఆయన తెలంగాణలో కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా పని చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం ఉందనగా.. బీఆర్ఎస్ కు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పీకేను పిలిచి ఏం చేయాలని అడిగారు కేసీఆర్. పీకేతో భేటీ అయ్యారు అంటే.. పీకేకు రాజకీయ పార్టీలు ఎంత ప్రాధాన్యత ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐప్యాక్ సంస్థ పేరుతో పలు రాజకీయ పార్టీలకు పీకే టీమ్ వర్క్ చేస్తుంటుంది. ఎన్నికల్లో సాయం చేస్తుంది. ఎన్నికల్లో గెలుపు కోసం దోహద పడుతుంది పీకే టీమ్.

తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారట. కంగ్రాట్స్ చెప్పారట. అంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని పీకే ఊహించేశారా అనేదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ ముందే ఊహించారు. అందుకే బీఆర్ఎస్ తో కలిసి పని చేయలేమని కేసీఆర్ కు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 70 సీట్లకు పైగా గెలువబోతోందని పీకే ముందే ఊహించారు. అందుకే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పీకే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే చెప్పుకోవాలి.

Prashanth Kishore : పీకే చెప్పాడంటే ఆ పార్టీ గెలుపు ఖాయమేనా?

ఫలితాలు ఇంకా రాకున్నా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు మాత్రం ఎప్పుడో ఖాయం అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలువబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ గెలుపు గురించే చర్చిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పక్కన పెడితే పీకే లాంటి వ్యక్తి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడం నిజంగానే కాంగ్రెస్ గెలుపు అవకాశాలను ఎక్కువ చేస్తోంది. రేపు ఈ సమయం వరకు తెలంగాణలో ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది