prashanth kishore call to revanth reddy and congratulates him
Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ అనగానే మనకు గుర్తొచ్చేది వైసీపీ పార్టీ. ఏపీలో వైసీపీ పార్టీ 2019 లో గెలవడంలో పీకే టీమ్ ముఖ్య పాత్ర పోషించింది. అలాగే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంలోనూ పీకే పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.2014 నుంచి పీకే అంటేనే దేశంలో ట్రెండ్ అయిపోయాడు. ఆయన తెలంగాణలో కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా పని చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం ఉందనగా.. బీఆర్ఎస్ కు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పీకేను పిలిచి ఏం చేయాలని అడిగారు కేసీఆర్. పీకేతో భేటీ అయ్యారు అంటే.. పీకేకు రాజకీయ పార్టీలు ఎంత ప్రాధాన్యత ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐప్యాక్ సంస్థ పేరుతో పలు రాజకీయ పార్టీలకు పీకే టీమ్ వర్క్ చేస్తుంటుంది. ఎన్నికల్లో సాయం చేస్తుంది. ఎన్నికల్లో గెలుపు కోసం దోహద పడుతుంది పీకే టీమ్.
తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారట. కంగ్రాట్స్ చెప్పారట. అంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని పీకే ఊహించేశారా అనేదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ ముందే ఊహించారు. అందుకే బీఆర్ఎస్ తో కలిసి పని చేయలేమని కేసీఆర్ కు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 70 సీట్లకు పైగా గెలువబోతోందని పీకే ముందే ఊహించారు. అందుకే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పీకే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే చెప్పుకోవాలి.
ఫలితాలు ఇంకా రాకున్నా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు మాత్రం ఎప్పుడో ఖాయం అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలువబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ గెలుపు గురించే చర్చిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పక్కన పెడితే పీకే లాంటి వ్యక్తి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడం నిజంగానే కాంగ్రెస్ గెలుపు అవకాశాలను ఎక్కువ చేస్తోంది. రేపు ఈ సమయం వరకు తెలంగాణలో ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.