pawan kalyan comments on tdp and janasena alliance
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా టీడీపీ, జనసేన పొత్తుపై మరోసారి స్పందించారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన తోటి పక్కన ఉండే వాళ్లతో కూడా మనకు కలుపుగోలు తనం లేకపోతే ఎలా? నాకు ప్రత్యేకించి కులాల ఐక్యత అని పెట్టడానికి కీలకంగా ఆలోచించాను. కులాలుగా మనం విడిపోతున్నాం. ఏ పార్టీ కూడా ఒక కులాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయం చేసుకోవడం లేదు. టీడీపీ కావచ్చు.. వైసీపీ కావచ్చు.. ఏ పార్టీ కూడా కులాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాన్ని నడపడం లేదు. అన్ని కులాలకు మనం చేయాలి. అన్ని వర్గాలకు చేయాలి. ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతస్తులకు, కులాలకు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయాలి. మీరు ఇది అవగాహన లేకపోతే వైసీపీ ట్రాప్ లో పడిపోతారు. వైసీపీ క్యాస్ట్ ట్రాప్ లో పడకండి. మీరు డిబేట్స్ కు వెళ్లినా.. ఎక్కడ వెళ్లినా కులానికి మోసం చేస్తున్నాం అంటారు వైసీపీ వాళ్లు. నేను మానవత్వం అన్న భావనతో వచ్చిన వాడిని. నిజంగా మానవత్వం ఉన్నవాళ్లు అన్ని కులాలను సమానంగా చూస్తారు. ఒక్క కులాన్నే పట్టుకొని వెళ్తే అప్పుడు వాళ్లు కుల నాయకులు అవుతారు అంటూ పవన్ చెప్పుకొచ్చారు.
ఓడిపోయినప్పుడు ఎవరు నిలబడతారు అనేది ముఖ్యం. అంతపెద్ద ఉవ్వెత్తున లేచిన పొలిటికల్ ప్రస్థానం ఎందుకు ఆగిపోయింది అంటే.. ఓటమి సమయంలో అందరూ వదిలేశారు. కానీ.. ఓటమి సమయంలో నాకు మీరంతా 2008 లో నిలబడి ఉన్నారు. అందుకే మనోహర్ అంటే నాకు అంత గౌరవం. చాలామంది వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోగానే అందరూ నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను కోరుకునేది ఏంటంటే.. రెండు పార్లమెంట్ సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు కేంద్రంలో కూర్చొంటే.. మీకు ప్రయాణం చేయడానికి ముందు ఓపిక లేదు. అందుకే వాళ్లకు ఏం చెప్పలేదు. పార్టీలో ఎవరైనా వెళ్తానంటే దయచేసి నేను ఎవ్వరినీ ఆపను. నాకు ప్రజలే ముఖ్యం. నా భావనను అర్థం చేసుకునే నాయకులు ఉంటే.. ఖచ్చితంగా నన్ను నాయకులే అర్థం చేసుకుంటారు. పెట్టుబడి పెట్టింది నేను.. నిలబడింది నేను.. దెబ్బలు తిన్నది నేను. అవమానం తిన్నది నేను. నాతో నిలబడ్డ జనసైనికులు.. వీర మహిళలు.. నా మీద ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనుడిని కాదు.. అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
నాకు తన మన భేదం లేదు. నేను అనుకున్న గోల్ ను సాధిస్తాను. ఏంటి నా గోల్. ఏపీ ఎప్పటికీ కూడా తలదించుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. అలా ఉండకూడదంటే నువ్వు డిస్ట్రక్టివ్ గేమ్ ఆడకూడదు. 2014 లో టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేశానో చెబుతాను. నేను ఒక మాట చెబితే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగేలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాలి. భవిష్యత్తు తాలుకు ఏపీ పరిస్థితిని అగమ్యగోచరం చేసింది. ఏపీ విభజనలో సరిగ్గా న్యాయం జరగలేని పరిస్థితుల్లో మనం పార్టీ పెట్టకుండా వదిలేసి ఉంటే.. మనకి విడిపోయినా కూడా ఏపీకి న్యాయం జరిగి ఉండేదేమో అని భావన వచ్చేది. అందుకే నేను టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చాను. గతంలో ఒక తప్పు జరిగింది.. ఎందుకు అంటే.. ఒక పార్టీని నడపలేకపోయాం అని అనుకున్నాం. ఆఖరి ప్రాణం వరకు పార్టీని తీయకూడదు. గెలుస్తామా లేదా అనేది పక్కన పెడితే బరిలో నిలబడి ఉండాలి.. అంటూ టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.