YS Jagan : ప్రశాంత్ కిషోర్ దెబ్బకి జగన్ కి ‘ఆ మ్యాటర్’ బాగా వర్క్ ఔట్ అయింది.. బంగారం లాంటి గుడ్ న్యూస్
YS Jagan : 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ( YSRCP ) అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ప్రశాంత్ కిషోర్. ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఆయన ఎన్నికల వ్యూహకర్త. 2019 ఎన్నికల కంటే ముందే జగన్ తో జతకట్టిన ప్రశాంత్ కిషోర్ ( prashant kishor ) .. ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఐప్యాక్ అనే సంస్థ ప్రశాంత్ కిషోర్ దే. ఇప్పటికీ ఈ సంస్థ వైసీపీతో పని చేస్తోంది. అంతే కాదు.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ సంస్థ పనిచేసేది. ఇదివరకు టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య ఒప్పందం కుదిరింది కానీ.. ఇప్పుడు ఏమైందో తెలియదు. ఐప్యాక్ బృందం ప్రస్తుతం తెలంగాణను వదిలేసి ఏపీకి వెళ్లిపోయింది.
ఏపీలో పీకే బృందం విస్తృతంగా పర్యటించనుంది. ఎందుకంటే.. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఐప్యాక్ బృందం అలర్ట్ అయింది. ఇప్పటి వరకు ఐప్యాక్ సభ్యులు అంతా వెనుక ఉండి అంతా నడిపించారు. కానీ.. ఇప్పుడు మాత్రం ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేరుగా ప్రజలను మాత్రమే కాదు.. మంత్రులను, ఎమ్మెల్యలను కూడా కలవనున్నారు. ప్రస్తుతం ప్రతి వారం ఐప్యాక్ సీఎం జగన్ కు నివేదిక అందజేస్తోంది.
YS Jagan : ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఐప్యాక్ ప్రతినిధి
ఈనెల 15 నుంచి ఒక్కో ఐప్యాక్ సభ్యుడికి ఒక ఎమ్మెల్యేను అటాచ్ చేయబోతున్నారట. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్ షాప్ లో సీఎం జగన్ ఈ విషయాలను వెల్లడించారు. అందుకే.. ముందుగానే ఐప్యాక్ ప్రతినిధులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తమ పర్యటనలో ప్రజలతో మాట్లాడనున్నారు. ఆ ఫీడ్ బ్యాక్ ను సీఎం జగన్ కు అందిస్తారు. అలాగే రెస్పెక్టివ్ ఎమ్మెల్యే, ఎంపీకి కూడా ఆ నివేదికను అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి వాళ్లతో చర్చిస్తారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేదాన్ని బట్టి ముందడుగు వేయనున్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చాలా ప్లస్ కానున్నాయి. మొత్తానికి ఐప్యాక్ ప్రతినిధులు సీఎం జగన్ కు ఇప్పటి నుంచే చాలా హెల్ప్ చేస్తున్నారు. వైసీపీ నేతలకు చాలా సమయం కేటాయించి వాళ్లు గెలిచాలా కృషి చేయనున్నారు.