Raghu Babu : జగన్ పాలనని ఆకాశానికి ఎత్తేసిన రఘుబాబు.. మా ఇంట్లో పనివారు ఎంతో సంతోషంగా ఉన్నారు..!
ప్రధానాంశాలు:
Raghu Babu : జగన్ పాలనని ఆకాశానికి ఎత్తేసిన రఘుబాబు.. మా ఇంట్లో పనివారు ఎంతో సంతోషంగా ఉన్నారు..!
Raghu Babu : రాజకీయాలకి, సినిమాలకి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. రాజకీయ నాయకులని ఎత్తాలన్నా, కిందకి పడేయాలన్నా సినిమా వాళ్ల పాత్ర ప్రత్యేకంగా అని చెప్పాలి. మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్‌ని కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరి కొందరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా సినీ నటుడు రఘుబాబు.. జగన్ పాలనని ఆకాశానికి ఎత్తాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని రఘుబాబు అన్నారు. గతంలో ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని ఆయన తెలియజేశారు.
Raghu Babu : పాలన చాలా బాగుంది..
రఘుబాబు తన సొంతూరైన ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంకి వెళ్లినప్పుడు మీడియాతో ముచ్చటించారు. జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏమాత్రం ఊహించలేదు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్ కోరుకుంటున్నారు అనేది ఆయన పరిపాలన చూస్తుంటే స్పష్టంగా అర్ధమవుతుంది. మారుమూల ఉన్న ప్రభుత్వ పాఠశాలలని చూస్తుంటే కార్పొరేట్ స్కూల్స్ గుర్తొస్తున్నాయి. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలో చదవుతున్నారంటే ఏదోలా చూసేవారు. కాని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దొరకడం లేదంటూ బోర్డ్‌లు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మారడంతో గతంలో 20, 30 శాతం కూడా విద్యార్థులు కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు నూరు శాతం ఆక్యుపెన్సిని గమనించాను అని అన్నారు రఘుబాబు.
నేను ఇప్పుడు ఎలాంటి పార్టీతో టచ్‌ల లేను, రాజకీయాలతో సంబంధం లేదు. కాని జగన్ పరిపాలన చూసాక చాలా గర్వంగా ఉందని అన్నారు. గ్రామ సచివాలయం కావచ్చు, వాలంటర్లు ఇళ్లకు రావడం, విలేజ్ హెల్త్ క్లినిక్, డాక్టర్ ఇంటి దగ్గరికి వచ్చి చూడడం, ప్రభుత్వ పథకాలు ప్రతిదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం చాలా గొప్పగా అనిపిస్తుందని తెలియజేశారు.ఏదో అవసరం కోసం అబద్దాలు చెప్పాల్సిన పని నాకు లేదు. నా సొంత ఊరి ఇంట్లో పని చేసే పనిమనుషుల జీవితాలలో వచ్చిన మార్పులని చూస్తుంటే ప్రస్తుత పాలన ఎంత బాగుందో అర్ధమవుతుందని రఘుబాబు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకోగలడం వల్ల ఎన్నడు చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోందని రఘుబాబు చెప్పుకొచ్చారు.