Ysrcp : వైసీపీలో కూలిపోతున్న మెయిన్ పిల్లర్స్ .. ఎందుకిలా జరుగుతుంది…!
ప్రధానాంశాలు:
Ysrcp : వైసీపీలో కూలిపోతున్న మెయిన్ పిల్లర్స్ .. ఎందుకిలా జరుగుతుంది...!
Ysrcp : రోజు రోజుకి వైసీపీ YCP మరింత వీక్ అవుతుంది. వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 గా ప్రభావం చూపిన విజయసాయిరెడ్డి vijayasai reddy రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇంకో మూడేళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి Ysrcp సైతం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత జగన్ కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఇటీవల ఢిల్లీలో delhi Media మీడియాతో చెప్పిన విధంగానే వ్యవసాయం మొదలుపెట్టారు.ఇక, ఇదే సమయంలో బీజేపీ BJP ముఖ్య నేత తాజా నిర్ణయం పై సాయిరెడ్డిని అభినందించటంతో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంటోంది.

Ysrcp : వైసీపీలో కూలిపోతున్న మెయిన్ పిల్లర్స్ .. ఎందుకిలా జరుగుతుంది…!
Ysrcp ఏం జరుగుతుంది..
వైసీపీ YCP పరిణామాల వలనే సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీలో వెళ్లేందుకు సాయిరెడ్డి సిద్దం అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కానీ, సాయిరెడ్డి తాను ఏ పార్టీలో చేరటం లేదని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండి జగన్‌తో కలిసి పని చేసిన విజయ సాయి రెడ్డి ఇలా సడెన్‌గా ఎందుకు తప్పుకున్నాడు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు.. జగన్ పార్టీ పెట్టాలన్న ఆలోచన చేసినప్పటి నుంచి విజయసాయిరెడ్డి భాగస్వామి. ఇక మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా అంతే. అయితే ఈ ముగ్గురిలో షర్మిల, విజయసాయి ఇప్పుడు పార్టీలో లేరు .. ఇప్పుడు విజయసాయి నిష్క్రమణ కూడా చర్చనీయాంశమే.
జగన్ అంటే అభిమానం అంటూనే ఆయన దేశంలో లేనప్పుడు తప్పుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మధ్య చాలా మంది కూడా పార్టీకి దూరమవుతుండడం అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తుంది. సినీనటుడు పోశాని క్రిష్ణమురళి వంటివారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినీ నటి శ్రీరెడ్డి సైతం ఇకపై వైసీపీ తరఫున మాట్లాడనని సోషల్ మీడియాలో Social Media ప్రకటించుకున్నారు. ఇదివరకు వీరు వైసీపీకి బలమైన మద్దతుదారులు. కానీ ప్రస్తుతం తమకు పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు పార్టీ నుండి తప్పుకుంటే రానున్న రోజులలో పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడం ఖాయం అంటున్నారు.